Chennai floods: భారీ వర్షాలతో చెన్నై నగరం వణికిపోతోంది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుని దిగువకు ప్రవహిస్తున్నాయి. చెన్నైలోని లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెన్నైకు ఎవరూ రావద్దనే హెచ్చరికలు జారీ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు(Tamilnadu)చరిత్రలో 2015 ఓ పీడకల. ముఖ్యంగా చెన్నై నగరవాసులకు. దాదాపు నగరాన్ని ముంచెత్తిన భయంకరమైన వరద అది. ఇప్పుడు మరోసారి చెన్నైని ఆ భయం వెంటాడుతోంది. గత 48 గంటల్నించి  కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై వణికిపోతోంది(Chennai Floods). వాగులు, వంకలు, నదులు అన్నీ పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలన్నీ నిండుకోవడంతో కిందకు నీరు విడుదల చేస్తున్నారు. ఫలితంగా 2015 నాటి భయంకర అనుభవాలు గుర్తొచ్చి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా ఆరేళ్ల క్రితం చెంబరం బాక్కం నుంచి హఠాత్తుగా నీరు విడుదల చేయడంతో నగరం భయంకర పరిస్థితులు ఎదుర్కొంది. ఇప్పుడు తిరిగి అదే పరిస్థితి ఏర్పడుతోంది. పూర్తి స్థాయి నీటమట్టానికి చేరువలో ఉంది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్థవ్యస్థమైంది. చెన్నైకు తాగునీరు అందించే చెంబరం బాక్కం, పూండి, పుళల్ రిజర్వాయర్ల నుంచి వరనీటి విడుదలతో రవాణా స్థంభించిపోయింది. రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తర, దక్షిణ చెన్నై పరిధిలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం వరకూ 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో రహదారులన్నీ చెరువులుగా మారిపోయాయి. నగరంలో 50 పైగా జలాశయాలు నిండుకున్నాయి.


మరోవైపు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin)పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చెన్నైకు బయటీ వారెవరూ రావద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. వరద ముప్పు హెచ్చరిక జారీ చేసి..లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ప్రత్యేక శిబిరాలకు తరలిస్తోంది. ముఖ్యమంత్రి ఇతర అధికారులతో కలిసి వరద ప్రాంతాలకు వెళ్లి స్వయంగా పరిస్థితుల్ని సమీక్షించారు. ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా సహాయ ,కార్యక్రమాలు అందించాలంటూ అధికారుల్ని ఆదేశించారు. స్టాలిన్‌ విజ్ఞప్తి మేరకు నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ కూడా రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. చెన్నైతో పాటు తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో వచ్చే రెండు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఆగ్నేయ బంగాళా ఖాతంలో(Bay of Bengal)ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా తమిళనాడు, పాండిచ్చేరిలో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. సోమవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని, మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 


Also read: Zika Virus: యూపీలో 'జికా' కల్లోలం..89కి చేరిన కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook