Chennai to Mumbai Train Fire Accident: ఒడిషాలో వరుస రైలు ప్రమాదాల ఘటనలు ఇంకా మరువక ముందే గురువారం చెన్నై సమీపంలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి ముంబైకి బయల్దేరిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు చెన్నైలోని ప్యాషన్ బ్రిడ్జ్ జంక్షన్ దాటుతుండగానే రైలులోని ఓ బోగీలో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదాన్ని పసిగట్టిన లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో ప్రయాణికులు బోగీలోంచి తమ ప్రాణాలు కాపాడుకున్నట్టు సమాచారం అందుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కప్లర్‌లో సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటనపై దక్షిణ రైల్వేకు చెందిన ఉన్నతాధికారులు స్పందించి మీడియాకు వివరణ ఇచ్చారు. కప్లర్‌లో సమస్య వల్లే పొగ వచ్చిందని.. వెంటనే ఫిర్యాదు అందుకున్న తమ సిబ్బంది హుటాహటిన ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మత్తు చేసి సాంకేతిక సమస్యను సరిదిద్దారని తెలిపారు. అనంతరం రైలు ప్రయాణికులతో సహా క్షేమంగా అక్కడి నుంచి ముంబైకి బయల్దేరింది అని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని దక్షిణ రైల్వే అధికారులు పేర్కొన్నారు. 


ఇది కూడా చదవండి: Underwater Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే భారత్‌లో అండర్ వాటర్ మెట్రో..


చెన్నై నుంచి ముంబైకి బయల్దేరిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది అని తెలియడంతో ఆ రైలులో ప్రయాణిస్తున్న వారి సంబంధీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరైతే ప్రయాణికులు అందించిన సమాచారంతో వెంటనే చెన్నైలోని ప్యాషన్ బ్రిడ్జ్ జంక్షన్‌కి చేరుకుని తమ వారిని కలిసి పరిస్థితిని నేరుగా అడిగి తెలుసుకున్నాకే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి హానీ కలగలేదు అని దక్షిణ రైల్వే అధికారులు స్పష్టత ఇవ్వడంతో ప్రయాణికులకు సంబంధించిన వారు అందకూ రిలాక్స్ అయ్యారు. 


మొత్తానికి వరుస రైలు ప్రమాదాలు అటు రైలు ప్రయాణికులను ఇటు వారి సంబంధీకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రైలు ప్రయాణం అంటేనే హడలిపోయే దుస్థితి నెలకొంది. రైలు ప్రయాణం చేస్తున్న వారు సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు తమలోనూ, తమ సంబంధీకులలోనూ ఏదో తెలియని ఆందోళన వ్యక్తమవుతోంది అంటున్నారు రైలు ప్రయాణికులు.


ఇది కూడా చదవండి: Threat to PM Modi, Amit Shah: మోదీ, అమిత్ షా, నితీశ్‌లను చంపేస్తానని బెదిరింపు కాల్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook