చోటా షకీల్ బతికున్నాడా.. మరణించాడా..?
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు చోటా షకీల్ బతికున్నాడా లేదా? అన్న అంశంపై ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు చోటా షకీల్ బతికున్నాడా లేదా? అన్న అంశంపై ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతకొంత కాలంగా ఈ మాఫియా నేత కనిపించకపోవడం వల్ల బహుశా ప్రత్యర్థులు అతన్ని హతమార్చుంటారని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే షకీల్‌కు సంబంధించిన కొందరు అనుచరులు ఫోన్‌లో మాట్లాడుకున్న సంభాషణను రికార్డు చేసిన పోలీసులు.. అందులో షకీల్‌కు సంబంధించిన మరణవార్తను విన్నట్లు వినికిడి. అయితే ఈ విషయమై ఇంకా పూర్తిగా ఒక అంచనాకి రాలేమని..నిజానిజాలు తేలాల్సి ఉందని ముంబయి పోలీసులు అంటున్నారు.
చోటా షకీల్ 6 జనవరి, 2017 తేదిన హత్యకు గురయ్యాడని ప్రస్తుతం పలు వార్తలు కూడా వస్తున్నాయి. తీవ్రమైన గుండెపోటు రావడంతో షకీల్ పాకిస్తాన్‌లోని రావల్పిండి ఆసుపత్రిలో చేరాడని.. అక్కడే మరణించాడని.. అయితే ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదన్నది కొన్ని నిఘా వర్గాల అభిప్రాయం. అయితే షకీల్ ఆసుపత్రిలో చనిపోలేదని.. ఆయనను ప్రత్యర్థులు హత్యమార్చారన్నది మరో కథ. విభేదాల కారణంగా దావూదే షకీల్‌ను హతమార్చి, ఎవరికీ తెలియకుండా కరాచీకి ఖననం చేయించడానికి పంపించాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే షకీల్ మరణవార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని.. ఆయన బతికే ఉన్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.