అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత నమ్మకస్థుడు, కుడి చేయిగా ఉన్న చోటా షకీల్, 'డి' (దావూద్) ముఠాతో సంబంధాలను తెగదెంపులు చేసుకున్నట్లు సమాచారం. దావూద్ ముఠాలో చోటా షకీల్ ది రెండవ స్థానం. గత 30 సంవత్సరాలు డాన్ దగ్గర నమ్మకస్తుడిగా ఉన్నాడు. అబూ సలేం దావూద్ నుండి వెళ్ళిపోయాక, చోటా షకీల్ అండర్ వరల్డ్ ప్రపంచంలో అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఎదిగాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చోటా షకీల్,  దావూద్ ను ముఠా నుండి బయటకు వచ్చినట్టు నివేదికలు అందాయని ఆయనతో సంబంధం ఉన్న రహస్య ఏజెన్సీ రిపోర్ట్ ల ద్వారా తెలిసిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కరాచీలో ఉన్న క్లిఫ్టన్ ప్రాంతాల్లో వారు ఇప్పుడు లేరని రిపోర్ట్ లు తెలిపాయి. ఇద్దరూ 1980 లలో భారతదేశం నుండి పారిపోయినప్పటి నుంచి వారి స్థావరాన్ని ఇక్కడే ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడే దావూద్ తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 


తిరుగుబాటుకు కారణం


దావూద్ ముఠాలో యువ సోదరుడు అనీస్ ఇబ్రహీం పెరుగుతున్న స్థాయి కారణంగా, చోటా షకీల్ బయటకు వచ్చినట్టు తెలిసింది. 30ఏళ్లుగా షకీల్ దావూద్ దగ్గర ఉంటూ ముఠా మొత్తాన్ని కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగాడు. కానీ దావూద్ ముఠా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని షకీల్ కు చెప్పాడట. కానీ వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి పాకిస్థాన్  గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రయత్నిస్తోంది.