లోక్ సభ ఎన్నికలతో పాటు మధ్యప్రదేశ్ లోని చింద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. కాగా ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ బరిలోకి దిగుతున్నారు. తన కుమారుడు రాజీనామా చేసిన స్థానంలో ఆయన ఎమ్మెల్యే అభ్యర్ధిగా  కమల్‌నాథ్ పోటీ పడుతున్నారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఛింద్‌వాడా ఎంపీగా ఉన్న కమల్ నాథ్ ను అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందున ఆయన అంసెబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆయన ఈ రోజు తన సొంత నియోజకవర్గమైన చింద్వారా నుంచి బరిలోకి నిలిచారు.


ఇదిలా ఉండగా కమల్ నాథ్ ఎంపీగా 9 సార్లు ప్రాతినిధ్యం వహించిన ఛింద్‌వాడా లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆయన తనయుడు నకుల్‌నాథ్‌ బరిలో ఉండడం విశేషం.