Children get Covid-19 with mild symptoms or asymptomatic: న్యూఢిల్లీ: కరోనా ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే.. కరోనా సెకండ్ వేవ్‌లో కొవిడ్ బారిన పడిన చిన్నారుల సంఖ్య పెరిగిందని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కుమార్ పాల్ (Dr Vinod Kumar Paul) తెలిపారు. ఈ నేపథ్యంలో చిన్నారుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని డా వికె పాల్ అభిప్రాయపడ్జారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరిస్తూ డా. వి.కే. పాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్నారులకు కరోనావైరస్ సోకినా అంతగా ప్రమాదం ఏమీ ఉండదని.. చాలా కేసుల్లో వారిలో తేలికపాటి లక్షణాలు కానీ లేదా అసలు లక్షణాలు లేకపోవడం కానీ జరుగుతుందని చెప్పిన ఆయన.. అయితే చిన్నారుల నుంచి పెద్దలకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందని అన్నారు. అందుకే చిన్నారుల కదలికలను కట్టడి చేసి వారికి వైరస్ సంక్రమించకుండా అలాగే వారి నుంచి వైరస్ మరొకరికి వ్యాపించకుండా జాగ్రత్తపడాలని సూచించారు. 


డా వి.కె. పాల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ నగరాలు, పట్టణాల కంటే గ్రామీణ భారతంపైనే అధిక ప్రభావం చూపించిందని అన్నారు. ఏదేమైనా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతోంది (India COVID-19 report). యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గి రికవరీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వి.కే. పాల్ తెలిపారు.