Hepatitis Disease: ప్రపంచంలో కరోనా వైరస్‌ ముప్పు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్‌తో పెద్దలే  కాకుండా చిన్న పిల్లలు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. దేశంలో కరోనానే కాకుండా చిన్నారులపై ఓ రహస్యపు ప్రాణాంతకమై వ్యాధి పంజా విసురుతోంది. అది పిల్లల భవిష్యత్‌ జీవితాలను నాశనం చేస్తుంది. చిన్నారుల ప్రాణాలపై హెపటైటిస్ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతోంది.  ఇప్పుడు దేశంలో హెపటైటిస్ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అకస్మాత్తుగా కేసులు పెరగడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వైద్య నిపుణులు ఈ వ్యాధి పిల్లలో రావడానికి గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు: 
ఈ వ్యాధిపై ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలను జారీ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాధి అధికంగా యూకేలో విస్తరిస్తోంది. అయితే ఈ వ్యాధికి సంబంధించిన కేసులు 144 నమోదు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 169 కేసులు నమోదు అయ్యాయని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా యూకే ను పలు ఆంక్షలు పాటించాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. ప్రపంచంలో వైద్య నిపుణులు ఈ వ్యాధికి గల కారణాలపై పలు పరిశోధనలు చేస్తున్నారని తెలిపింది. 


ఏమిటి హెపటైటిస్ అంటే:


హెపటైటిస్ అంటే కాలేయానికి సంబంధించిన ఓ వ్యాధి అని నిపుణులు తెలిపారు.  ఇది వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవాల వల్ల వచ్చే వ్యాధి. ఈ వైరస్‌ల వల్లనే మనవ శరీరంలోకి ఈ హెపటైటిస్ వైరల్ ప్రవేశిస్తుంది. దీని ద్వారా  కాలేయం, శరీరానికి సంబంధించిన వ్యాధులు వస్తాయని నిపుణులు తెలిపారు.


ఆ పిల్లలకు ప్రమాదం ఎక్కువ: 


ఈ హెపటైటిస్ గురవుతున్న పిల్లల్లో ఎక్కవ శాతం చిన్నారులు కోవిడ్-19 బాధితులే కావడం గమనార్హం. ల్యాబ్ డేటా ప్రకారం..ఈ వైరస్ 1 నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో ఎక్కువగా వ్యాపిస్తుందని నిపుణులు తెలిపారు. ఈ అంశంపై వైద్య నిపుణులు స్పందింస్తూ..తల్లిదండ్రులు పిల్లల్లో వచ్చే హెపటైటిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఒక వేళా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని సూచించారు.


ఆయా దేశాల్లో గుబులు పుట్టిస్తున్న కేసులు:


పోస్ట్ కోవిడ్‌ తరువాత పిల్లలలో ఈ వ్యాధిని అత్యధిక సంఖ్యలో  (114) బ్రిటన్‌లో వెలుగు చూశాయి. ఆ తర్వాత స్పెయిన్ 13, ఇజ్రాయెల్ 12, అమెరికా 9, డెన్మార్క్ 6, ఐర్లాండ్ 5, నెదర్లాండ్స్ 4, ఫ్రాన్స్ 2, నార్వే 2, రొమేనియా 2, బెల్జియం 5 కేసులుగా నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. నివేదికలు తెలిపిన ప్రకారం ఈ వ్యాధి కారణంగా ఒక చిన్నారి మృతి చెందగా.. చాలా మంది చిన్నారు దీనితో బాధపడుతున్నారు. అయితే ఈ మరణం ఏ దేశంలో సంభవించిందో WHO వెల్లడించలేదు. 


హెపటైటిస్ లక్షణాలు:


#మూత్రం పసుపు రంగులోకి రావడం
#చర్మంపై దురద రావడం
#కళ్ళు, చర్మం పసుపు రంగులోకి రావడం
#కండరాల, కీళ్ల నొప్పి
#తీవ్ర జ్వరం
#కడుపు నొప్పి
#ఆకలి లేకపోవడం


Also Read: Horoscope Today April 23 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు 'రియల్ ఎస్టేట్‌'కు దూరంగా ఉంటే మంచిది..


Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్... త్వరలో మరో రెండు 'డీఏ'లు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook