Rajnath Singh Speaking in Lok Sabha: న్యూఢిల్లీ: భారత్‌-చైనా ( India-China ) మధ్య కొన్నినెలల నుంచి ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దు సమస్యపై ఇదు దేశాల సైన్యాధికారుల మధ్య చర్చలు జరుగుతున్న క్రమంలోనే.. ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్యపై మంగళవారం పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక ప్రకటన చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఏమాత్రం తగ్గలేదని.. ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని స్పష్టంచేశారు. చైనా ప్రయత్నాలను నిలువరించేందుకు భారత దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయన్నారు. ఈ మేరకు ఇటీవల కాలంలో తాను, ప్రధాని మోదీ ఎల్‌ఏసీలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమయంలో దేశం మొత్తం సైన్యం వెంటే నిలించిందని పేర్కొన్నారు.  Also read: Mimi Chakraborty: ఎంపీ, నటితో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్


అయితే.. చైనాతో మన సైన్యం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర (LAC) స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నా.. డ్రాగన్‌ దూకుడుగా వ్యవహరిస్తోందని.. దీంతో శాంతి ఒప్పందంపై ప్రభావం పడుతోందన్నారు. 1950 నుంచి భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం అలానే ఉందని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. చైనా లడఖ్‌లో సుమారు 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించిందని పేర్కొన్నారు. ఇది ద్వైపాక్షిక సంబంధాలను చర్చలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. అయితే..  దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన చర్చలో.. భారత్‌ శాంతినే కోరుకుంటోందన్న విషయాన్ని చైనా రక్షణ మంత్రితో పేర్కొన్నట్లు ఆయన వివరించారు. Also read: Kangana Ranaut: అప్పుడు ఇలానే మాట్లాడేవారా? జయబచ్చన్‌పై కంగనా సీరియస్