చైనా 42 ఆండ్రాయిడ్ యాప్ ల ద్వారా గూడాచార్యం చేస్తుంది అనేది అత్యంత విశ్వసనీయ సమాచారం అని ఐబీ (ఇంటలిజెన్స్ బ్యూరో) వెల్లడించింది. 'సైనికులందరూ ఆ యాప్ లను తమ స్మార్ట్ ఫోన్ల నుండి తొలగించండి' అంటూ సూచించింది. భారత్  రక్షణ, భద్రత విషయాలను చైనా ఈ యాప్ ద్వారా తెలుసుకొనే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. రిపోర్ట్ ల ప్రకారం.. సరిహద్దు రేఖ వద్ద గస్తీ చేస్తున్న సైనికులందరూ తక్షణం తమ మొబైళ్ళలో నుంచి ఆ యాప్ లను తొలగించి.. ఫార్మాట్ చేయాలని ఐబీ హెచ్చరించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాప్స్ లో కొన్ని.. 


వియ్ చాట్ (Wechat)


 ట్రూకాలర్ (Truecaller)


వీబో (Weibo)


యూసీ బ్రౌజర్ (UC Browser)


యూసీ న్యూస్(UC News).. లాంటి మొదలైన 42 యాప్ లను వెంటనే తొలగించాలి. లేకపోతే భారత్ కు ప్రమాదకరమని వ్యాఖ్యానించింది.


చైనా మొబైల్స్ లో దేశ రక్షణ విషయాలు వెంటనే తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. భారత సైనికుల వద్ద ఈ తరహా స్మార్ట్ ఫోన్స్ ఉంటే యాప్ లను త్వరగా డిలీట్ చేయండి.  దేశ రక్షణ, భద్రత కు సంబంధించి ఇటువంటి యాప్ లు ఆందోళనలు కలిగిస్తాయని పేర్కొన్నారు.