China Virus: మీ పిల్లలు జాగ్రత్త.. చైనా వైరస్ బిగ్ అలర్ట్..
China Virus: చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ మహమ్మారి కేసులు...దేశంలోనూ భారీగా బయటపడుతున్నాయి. వరుసగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పొరుగు రాష్ట్రాలలో కొందరి చిన్నారుల్లో గుర్తించారు.
China Virus: కోవిడ్ మహామ్మారి తర్వాత ప్రస్తుతం ప్రపంచాన్ని చైనాకు చెందిన HMPV వైరస్ వణికిస్తోంది.ప్రస్తుత శీతాకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులలో చలి, జలుబు వంటి లక్షణాలను కలిగించే సాధారణ శ్వాస సంబంధిత వైరస్ గా డాక్టర్లు చెబుతున్నారు. కరోనా అంతటి ప్రమాదకరమైందని కాదని, జాగ్రత్తలను పాటిస్తే ఇది దరిచేరదని అంటున్నారు. ఈ వైరస్ వచ్చిన ఐదేళ్ల లోపు పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం, న్యుమోనియా లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. రోగ నిరోధక శక్తి తగ్గకుండా చిన్నపిల్లలు, వృద్ధులు పోషహకారం తీసుకోని తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్‌తో ప్రమాదం ఉండదని చెబుతున్నారు.
HMPV అంటే హ్యూమన్ మెటా నిమో వైరస్. ఇది ఒక శ్వాసకోశ వైరస్. ఇది సాధారణంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి తేలికపాటి లక్షణాలు కలిగిస్తుంది. కానీ చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. 2024 చివరలో ఉత్తర చైనాలో HMPV కేసులు గణనీయంగా పెరిగాయి. డిసెంబర్ 16 నుంచి 22 వరకు HMPV పాజిటివ్ కేసులు 6.2%, ఆసుపత్రిలో చేరికలు 5.4%గా నమోదయ్యాయి.
HMPV వైరస్ COVID-19 కంటే తక్కువ వ్యాప్తి కలిగిన వైరస్. ఇది అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ముప్పు కలిగించే అవకాశం లేదు. అయితే పిల్లలు, వృద్ధులు, ఇమ్యూనిటీ పవర్ తగ్గిన వారు జాగ్రత్తగా ఉండాలి. అయితే గత వారం రోజులుగా భారత్ లోనూ పలు రాష్ట్రాల్లో ఈ కేసులు భారీగా బయట పడుతున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్, తమిళనాడు,భాగ్య నగరం లోనూ బయటపడుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలలో HMPV వైరస్ ను గుర్తించారు. కానీ ఈ కేసులకు చైనాలో ఉన్న కేసులతో సంబంధం ఉన్నట్లు అధికారులు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
ప్రస్తుతం HMPV కోసం ప్రత్యేక మందులు లేదా టీకాలు లేవు. లక్షణాలను బట్టి చికిత్స అందిస్తుంటారు. చికిత్స ప్రధానంగా లక్షణాలను తగ్గించడం, విశ్రాంతి తీసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. HMPV కేసులు ఎక్కువగా శీతాకాలంలో నమోదు అవుతాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు సీజనల్ వ్యాధుల నమూనాలకు అనుగుణంగా ఉన్నాయి.
చాలా మంది 7 నుంచి 10 రోజులలోపు HMPV నుంచి పూర్తిగా కోలుకుంటారు. తీవ్రమైన సమస్యలైతే వైద్యుని సలహా తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO...HMPV పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ప్రజలకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలోనూ వరుసగా కేసులు రికార్డ్ అవుతుండటంతో... పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. ఎప్పటికప్పుడు HMPV వైరస్ పై ప్రజలను అలర్ట్ చేస్తోంది.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.