హైదరాబాద్: కరోనా (COVID-19) మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ కనుగొనేందుకు విస్తృతమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా సంస్థ సైనోవాక్ కీలక ప్రకటన చేసింది. మానవులపై జరుపుతున్న పరీక్షలకు సంబంధించి ఫేజ్3 దశను ప్రారంభించబోతున్నట్టు వెల్లడించింది. కాగా ఫేజ్1, ఫేజ్2 దశలను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొంది. వాక్సిన్ పై   ప్రయత్నాలను బ్రెజిల్ లో చేపట్టనున్నామని దీనికి సంబంధించి వాలంటీర్ల ఎంపిక కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది. ఈ ట్రయల్స్ కు సంబంధించి గత వారమే చైనా కంపెనీకి బ్రెజిల్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ICMR COVAXIN: కరోనా వ్యాక్సిన్‌పై స్పష్టత ఇచ్చిన ఐసీఎంఆర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: WHO: కోవిడ్ 19 వ్యాక్సీన్ అప్పుడే రాదు


వ్యాక్సిన్ వల్ల మనుషులపై వచ్చే అనుకూల ప్రతికూల ఫలితాలు  ఫేజ్1, ఫేజ్2 దశల్లోనే అంచనాకు రావొచ్చని, ఫేజ్3లో పూర్తి స్థాయిలో ఫలిత వెల్లడయ్యే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు ఫేజ్3 దశకు చేరుకున్న వ్యాక్సిన్ ల సంఖ్య మూడుకు చేరుకుంది. (Oxford)  ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెన్కా సంయుక్తంగా చేపట్టిన ప్రయోగాలు కూడా ప్రస్తుతం ఫేజ్3లో ఉన్నాయి. దీంతో పాటు సైనోఫామ్ కు చెందిన వ్యాక్సిన్ కూడా ఫేజ్3 దశలో ఉంది. 
 Also read: Corona virus: వందమంది కొంపముంచిన ఆ ఒక్కడు