కర్ణాటక: కర్ణాటకలోని చించోలి అసెంబ్లీ నియోజకవర్గానికి మే 19న ఉప ఎన్నిక జరుగనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉమేశ్‌ జాదవ్‌ రాజీనామాతో చించోలి అసెంబ్లీ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఇటీవల వరకు ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా వున్న ఉమేశ్ జాదవ్ ప్రస్తుతం గుల్‌బర్గా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 


చించోలి అసెంబ్లీ స్థానానికి ఏప్రిల్ 22న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా ఏప్రిల్‌ 29 నామినేషన్‌ దాఖలుకు చివరి తేది కానుంది. మే 19న ఉప ఎన్నిక జరగనుండగా మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.