ఆడపిల్ల.. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల..  కాదేదీ..కవితకు అనర్హం అన్నాడు ఓ మహాకవి. అలాగే.. 'కరోనా వైరస్' ప్రభావానికి ఇది.. అదీ అని తేడా లేకుండా పోయింది. అన్ని రంగాలపై కరోనా వైరస్ దెబ్బ పడుతోంది. ఇంకా చెప్పాలంటే కరోనా వైరస్ ప్రభావానికి ఏ రంగమైనా గజగజా వణికిపోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత దేశంలో రంగుల పండుగ హోలీ సంబరాలకు పెట్టింది పేరు. కానీ కరోనా వైరస్ ఎఫెక్ట్ దానిపైనా కనిపించింది. ప్రజలు పెద్ద ఎత్తున హోలీ నిర్వహించుకునేందుకు భయపడిపోయారు. హోలీ సంబరాలను తగ్గించుకోవాలని అంతకు ముందే ప్రభుత్వాలు కూడా ప్రచారం చేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు ఎక్కడ కూడా జనం గుంపులుగా ఉండేందుకు ఇష్టపడడం లేదు. ప్రజా రవాణా వ్యవస్థలోనూ అత్యవసరమైన వారు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. 


ఇప్పుడు తాజాగా సినిమా రంగంపైనా కరోనా వైరస్ ప్రభావం పడింది. కేరళలో కరోనా వైరస్ క్రమక్రమంగా విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 6కు చేరింది. దీంతో కేరళ అంతటా కరోనా పేరు చెబితేనే వణుకు పుడుతోంది. కేరళలో ఇప్పుడు గుంపు గుంపులుగా ఉన్న చోట్లకు వెళ్లేందుకు జనం ఇష్టపడడం లేదు. మరోవైపు సినిమా థియేటర్లపై ఈ ప్రభావం పడింది. అంతే కాకుండా ఈ నెల 31 వరకు సినిమా థియేటర్లు బంద్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మళయాలం సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలతో చర్చించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..