CAA 2019 Rules: 2019లో పార్లమెంట్ ఆమోదించిన అత్యంత వివాదాస్పద చట్టం పౌరసత్వ సవరణ చట్టం. మతం ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే ఏకైక చట్టం ఇదే. ముస్లింలకు తప్పించి మిగిలిన మతస్థులకు భారతదేశ పౌరసత్వం కల్పించే చట్టమిది. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో మరోసారి విదాస్పదమౌతోంది. ఈ క్రమంలో అసలు పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేయాలి, ఎవరికి అర్హత ఉందనే విషయంలో కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ 31 కంటే ముదు ఇండియాకు వలస వచ్చిన బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు బారతదేశ పౌరసత్వం లభిస్తుంది. ఈ దేశాల్నించి మత పరమైన హింస ఎదుర్కొన్న ఆ దేశాల్లోని మైనార్టీ మతాలైన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ, క్రైస్తవులకు పౌరసత్వం కల్పిస్తారు. 


పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేయాలి


సీఏఏ చట్టం ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన ముస్లిమేతరులు దరఖాస్తు చేసుకునేందుకు ముందుగా సెక్షన్ 6బి కింద రిజిస్ట్రేషన్ లేదా ఆన్‌లైన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన జిల్లా స్థాయి కమిటీ ద్వారా సాధికార కమిటీకి సమర్పించాలి. ఆ తరువాత పామ్ 9లో ఎలక్ట్రానిక్ రిసీప్ట్ అందుతుంది. ఆ తరువాత జిల్లా స్థాయి కమిటీ దరఖాస్తుతో పాటు సమర్పించిన కాగితాలను ధృవీకరిస్తుంది. చట్టంలోని రెండవ షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుదారునితో విధేయత ప్రమాణం చేయించి దానిపై సంతకం తీసుకుంటారు. దరఖాస్తుదారుడు ప్రమాణానికి హాజరుకాకుంటే జిల్లా స్థాయి కమిటీనే ఆ దరఖాస్తును తిరస్కరించవచ్చు.


సాధికారిక కమిటీ విచారణ అనంతరం దరఖాస్తు దారుని వివరాలపై సంతృప్తి చెందితే పౌరసత్వాన్ని మంజూరు చేయవచ్చు. సీఏఏ నిబంధనల్లోని సెక్షన్ 6బిలో కుండా మరో రెండు అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో మొదటిది దరఖాస్తులోని ప్రకటనను ధృవీకరించే అఫిడవిట్. రెండవది దరఖాస్తుదారుని స్వభావాన్ని నిరూపించే భారతీయ పౌరుడి అఫిడవిట్. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ భాషల్లో ఒకదానిపై తగిన పరిజ్ఞానమున్నట్టు దరఖాస్తుదారుడు అఫిడవిట్ ఇవ్వాలి.


Also read: CAA Protest: సీఏఏ అమలుపై ప్రతిపక్షాల అభ్యంతరం, ఎంఐఎం నేత అసదుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook