Assam: రూ.500 కోసం రగడ..ఓ వ్యక్తి దారుణ హత్య..ఘటన ఎక్కడ జరిగిందంటే..!
Assam: అరవింద సమేత వీర రాఘవ సినిమా తరహా ఘటన మరోమారు చోటుచేసుకుంది. మూవీలో రూ.5 కోసం గొడవ జరిగితే..అస్సాంలో రూ.500 కోసం యుద్ధం జరిగింది.
Assam: అస్సాంలో దారుణం జరిగింది. దయాల్‌పుర్ గ్రామంలో హేమ్‌రామ్, తునీరామ్ మాద్రి అనే వ్యక్తులు నివపిస్తున్నారు. హేమ్‌రామ్‌కు రూ.500 అవసరమై తునీరామ్ మాద్రిని అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని హేమ్‌రామ్‌కు మాద్రి చెప్పాడు. అయినా హేమ్‌రామ్ బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఇరువురు ఊగిపోయారు. ఈనేపథ్యంలోనే తన దగ్గర ఉన్న కత్తితో హేమ్‌రామ్‌పై మాద్రి దాడి చేశాడు.
మెడకు తీవ్ర గాయం కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం తలతో పది కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్లాడు. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కావాల్సి తనతో హేమ్‌రామ్ గొడవ పెట్టుకున్నాడని..అందుకే దాడి చేశానని పోలీసులకు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. గతంలో తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు వెలుగు చూశాయి. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో రూ.5 కోసం గొడవ మొదలవుతుంది. ఆ తర్వాత వరుసగా హత్యలు జరుగుతాయి. చివరకు ఈ ఘటన రెండు వర్గాల మధ్య వైరానికి దారి తీస్తుంది. ఈమూవీలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటాయి. సినిమా క్లైమాక్స్‌లో ఈసమస్యకు హీరో జూనియర్ ఎన్టీఆర్ పరిష్కారం చూపుతారు.
అరవింద సమేత వీర రాఘవ సినిమా విడుదల తర్వాత ఇలాంటి ఘటనలే వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా రీల్ సీన్ ఘటనలు రియల్‌గా చోటు చేసుకుంటున్నాయి. దీంతో పోలీసులు కేసును చేధించలేక తలలు పట్టుకుంటున్నారు.
Also read:Munugode ByPoll Live Updates: కోమటిరెడ్డితో పాటు బీజేపీలోకి మరో సీనియర్ నేత.. కాంగ్రెస్ లో పరేషాన్
Also read:AP Floods: ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి, కృష్ణమ్మ..రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్..!
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook