షాకింగ్: స్కూల్ బస్సు మిస్ అయిందని.. విద్యార్థి ఆత్మహత్య!
స్కూల్ బస్సు మిస్సైందని ఓ పాఠశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
Madhya Pradesh: తల్లిదండ్రులు తిట్టారనో, స్నేహితుడు కొట్టాడనో, సరిగ్గా చదవట్లేదనో..ఇలా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల దేశంలో ఎక్కువయ్యాయి. చిన్న వయసులో ఒత్తిడిని తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో వెలుగుచూసింది. స్కూల్ బస్సు మిస్తైందని ఓ పాఠశాల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Also Read: ట్రైనింగ్ లో తోటి ఉద్యోగి తుపాకీ మిస్‌ఫైర్.. కానిస్టేబుల్ మృతి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బేతూల్ జిల్లా(Betul district) ఘోరదోంగ్రీ మండలంలోని అమ్డోహ్ గ్రామం)Aamdoh village)లో.. రాహుల్(14) తొమ్మిదో తరగతి(class 9 student) చదువుతున్నాడు. రోజూలాగే సోమవారం ఉదయం పాఠశాలకు బయలుదేరాడు. కానీ రాహుల్ వెళ్లేసరికే బస్సు వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రాహుల్ ఇంట్లోని మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.ఆస్పత్రికి తీసుకెళ్లితే అప్పటికే రాహుల్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాహుల్ ప్రతిరోజు పాఠశాలకు వెళ్లేవాడని, చాలా క్రమశిక్షణ కలిగిన బాలుడని అతని అంకుల్ వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు(Police).. దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook