న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections 2020) సందడి మొదలైంది. శనివారం ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఢిల్లీ ఓటర్లు తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధీమాగా ఉన్నారు. నేడు ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ మహిళలకు కేజ్రీవాల్ ఓ రిక్వెస్ట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఢిల్లీలో మహిళా ఎస్ఐ దారుణహత్య కలకలం



‘ఢిల్లీ మహిళలందరికీ ప్రత్యేక విజ్ఞప్తి. మీరు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీరు ఇంటి బాధ్యతను స్వీకరించినట్లే, దేశం మరియు ఢిల్లీ బాధ్యత కూడా మీ భుజాలపై స్వీకరించాలి. ఆడవారంతా కచ్చితంగా ఓటు వేయడానికి వెళ్లాలి. మీరు మాత్రమే వెళ్లడం కాదు, మీ ఇంట్లోని మగవారిని కూడా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓటు వేసేలా చూడండి. ఎవరికి ఓటు వేస్తే తమకు ప్రయోజనం కలుగుతుందో ఇంట్లోని వారితో కచ్చితంగా చర్చించాలని’ ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.


Also Read: 5 సున్నిత పోలింగ్ కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం


Also Read: ఢిల్లీ ఎన్నికలు: ఓటింగ్ ప్రారంభం.. పోటెత్తుతున్న ఓటర్లు


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..