మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు పొడ చూపుతున్నాయి. సీఎం కమల్ నాథ్ తీరుపై యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా గళమెత్తారు. కమల్ నాథ్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆయన గుర్రుగానే ఉన్నారు. కానీ అధిష్ఠానంతోపాటు ముఖ్యంగా రాహుల్ గాంధీ బుజ్జగించడంతో ఓపికగా వ్యవహరించారు.

ఐతే ఎన్నికల ప్రచారం సందర్భంగా ..రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మేనిఫెస్టోలోనూ ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత .. ముఖ్యమంత్రిగా కమల్ నాథ్ సీఎం కుర్చీ దక్కించుకున్నారు. ఐతే ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సీఎం కమల్ నాథ్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో జ్యోతిరాదిత్య సింధియా .. ఆయనతో విభేదిస్తున్నారు. తాజాగా జ్యోతిరాదిత్య సింధియా . . ఓ అడుగు ముందుకు వేశారు. ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సీఎం కమల్ నాథ్ చర్యలు తీసుకోకపోతే. .. రైతులతో కలిసి రోడ్లపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇరువురు నాయకుల మధ్య విభేదాలు పొడచూపాయి. సీఎం కమల్ నాథ్‌ను ఈ విషయంపై విలేకరులు ప్రశ్నించగా .. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. చేస్తే చేసుకోనివ్వండి అంటూ పొడిగా సమాధానం దాటవేసి వెళ్లిపోయారు.
ఐతే ఈ ఇద్దరినీ బుజ్జగించేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.