Uddhav Thackeray Leaves Varsha: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామం.. ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం
Uddhav Thackeray Leaves Varsha: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన అధికారిక నివాసం `వర్ష` నుంచి ఖాళీ చేసి తన సొంత నివాసమైన మాతోశ్రీకి మారారు.
Uddhav Thackeray Leaves Varsha: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన అధికారిక నివాసం 'వర్ష' నుంచి ఖాళీ చేసి తన సొంత నివాసమైన మాతోశ్రీకి మారారు. శివసేన నేత ఏక్ నాథ్ షిండే కొంతమంది శివసేన ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు జండా ఎగరేసిన అనంతరం అధికార పార్టీ తీవ్ర సంక్షోభంలో పడటంతో పాటు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పదవి సైతం చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే.
ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం ఖాళీ చేసి వెళ్లే సమయంలో ఆయన వెంట తన భార్య రష్మీ ఠాక్రే, పెద్ద తనయుడు మంత్రి ఆదిత్య ఠాక్రే, చిన్న కొడుకు తేజస్ ఠాక్రే ఉన్నారు. ముఖ్యమంత్రి నివాసం సిబ్బంది లగేజీ తమ వెంట తీసుకెళ్లడం ఫోటోల్లో, వీడియోలో చూడవచ్చు. ఉద్ధవ్ ఠాక్రే అధికారిక బంగ్లా ఖాళీ చేసి వెళ్తుండగా.. అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్న ఆయన మద్ధతుదారులు, శివసేన పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఠాక్రేకు అనుకూల నినాదాలు చేస్తూ ఆయనకు అండగా నిలిచారు. ''మీ వెంట మేమున్నాం.. మీరు ముందుకు సాగిపోండి..'' అంటూ ఉద్ధవ్ ఠాక్రేకు (Uddhav Thackeray) అనుకూలంగా నినాదాలు చేశారు.
Also read : Uddhav Thackeray: దేనికైనా రెడీ..రాజీనామాపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు..!
Also read : Maharashtra crisis: ప్రభుత్వాల కూల్చివేతల్లో బీజేపీ కొత్త రికార్డ్.. మహారాష్ట్ర తర్వాత రాజస్థానేనా?
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.