CM Yogi Adityanath News: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ వరుసగా రెండో సారి అధికారం చేపట్టనుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో బీజేపీ టీమ్ సహా యోగి ఆదిత్యనాథ్ వర్గాలు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. అయితే కొందరు మాత్రం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాషాయ వేషధారణలో ఉండడానికి గల కారణమేంటనే దాని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా ఇప్పుడు సీఎం యోగి ఆదిత్యనాథ్ డ్రెస్ కు క్రేజ్ పెరిగింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది కాషాయం వేసుకుంటూ యూపీ ముఖ్యమంత్రి యోగిని అనుకరిస్తున్నారు. మెడలో రుద్రాక్షలు ధరించి, గుండుతో మెరిసిపోతున్నారు. ఇటీవలే జరిగిన యూపీ ఎలెక్షన్స్ లోనూ ఆయన అభిమానులు కాషాయ వేషాధారణలో పోలింగ్ బూత్ లకు వచ్చారు. అలా సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యారు. 


యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు


ఉత్తరప్రదేశ్ లో 403 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసి.. 260పైగా స్థానాలను చేజిక్కుచుంది. వరుసగా రెండో సారి అధికారాన్ని చలాయించేందుకు కమలం పార్టీ సిద్ధమైంది. 


యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చిన్నప్పటి నుంచి హిందుత్వ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి రంగం ప్రవేశం చేశారు. 26 ఏళ్ల వయస్సులోనే గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.  


Also Read: Election Result 2022: ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం... ఈ ఫలితాల నుంచి నేర్చుకుంటాం..: రాహుల్ గాంధీ


Also Read: UP Election Results: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జోరు... కాషాయ పార్టీ గెలుపుకు దోహదం చేసిన అంశాలివే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook