Sanjay Raut On Congress: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ లేకుండా ఏ ఒక్క పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో కాంగ్రెస్‌ వేళ్లూనుకుందని, మిగిలినవన్నీ ప్రాంతీయ పార్టీలని పేర్కొన్నారు. పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు గుప్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని దశాబ్దాల పాటు భాజపా అధికారంలో ఉండబోతోందంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చేసిన వ్యాఖ్యలపై  ఈ సందర్భంగా సంజయ్‌ రౌత్‌ స్పందించారు. దేశ రాజకీయాల్లో భాజపా ఉంటుందని గానీ, అధికారంలో మాత్రం కాదని రౌత్‌ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా తమను తాము చెప్పుకొనే భాజపా.. ఎన్నికల్లో ఓడిపోతే ప్రతిపక్షంలోనే ఉండాలని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రనే అందుకు ఉదాహరణ అని చెప్పారు.


ప్రస్తుతానికి తాము దాద్రానగర్‌ హవేలీ, గోవా ఎన్నికలపై దృష్టి సారించామని సంజయ్ రౌత్‌ తెలిపారు. యూపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని చెప్పారు. అక్కడ తమ పాత్ర పరిమితమే అయినా పోటీ చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రెండేళ్లుగా కరోనా పేరు చెప్పి తమ మంత్రులను కేంద్రం మీడియాకు దూరంగా ఉంచుతోందని.. వారిపై నిఘా కొనసాగుతోందని చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలోనూ మీడియాను ఈ స్థాయిలో అడ్డుకోలేదన్నారు. అనుకూలంగా లేని మీడియా సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సంజయ్ రౌత్‌ విమర్శించారు.


Also Read: Mumbai New Airport: ముంబై సమీపంలో పాల్ఘర్ వద్ద మరో విమానాశ్రయం  


Also Read: Mamata Banerjee: మమత టార్గెట్ మారిందా, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన దీదీ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook