ఢిల్లీ వాసులని చల్లటి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉష్టోగ్రతలు అమాంతంగా పడిపోవడంతో నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. పొగ మంచు కారణంగా అత్యంత సమీపంలో వున్నవి కూడా కనిపించని విధంగా జీరో విజిబిలిటీ పరిస్థితి ఏర్పడటంతో కొన్ని రైళ్ల రాకపోకలు పూర్తిగా రద్దు కాగా ఇంకొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రకటించిన వివరాల ప్రకారం 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా మరో 15 రైళ్లు రద్దయ్యాయని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు నిత్యం మంచు కురుస్తోన్న కారణంగా ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతూనే తమ దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఉత్తర భారతంలో చాలా చోట్ల దాదాపు ఇటువంటి పరిస్థితే నెలకొని వుంది. ఇదిలావుంటే, ఢిల్లీ వాతావరణంలోని గాలి కాలుష్యం సైతం అదే స్థాయిలో కొనసాగుతోంది.