September 30 Deadline: నిత్య జీవితంలో ముఖ్యమైన పనులు చేసుకోడానికి కొన్ని గడువు తేదీలుంటాయి. ఆ గడువు తేదీలోగా చేసుకోకపోతే తరువాత ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. సెప్టెంబర్ 30లోగా మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోవల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో పరిశీలించుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకింగ్ సంబంధిత విషయాల్లో మూడు ముఖ్యమైన పనుల్ని మీరంతా సెప్టెంబర్ 30వ తేదీలోగా పూర్తి చేసుకోవల్సి ఉంది. లేనిపక్షంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికే సెప్టెంబర్ నెలలో కేవలం 15 రోజులు మాత్రమే మిగిలాయి. ఈ పదిహేను రోజుల్లో ఆ మూడు ముఖ్యమైన పనులు పూర్తయ్యాయో లేదా చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే చేసేందుకు ప్రయత్నించండి. మరోసారి గడువు తేదీ పొడిగిస్తారని ఎదురు చూడవద్దు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లో వచ్చాయి. ముఖ్యంగా సామాన్యులకు కొత్త నిబంధనలు ప్రభావితం చేసేలా ఉన్నాయి. 


ఆధార్- పాన్ లింకింగ్, కేవైసీ అప్‌డేట్(Kyc Update)వంటివాటికి సెప్టెంబర్ 30 చివరి తేదీగా ఉంది. పాన్‌కార్డు-ఆధార్ కార్డు (Aadhaar-Pancard Link)పొడిగించేందుకు ఇప్పటికే ఆదాయపు పన్నుశాఖ (Incometax Department) చాలాసార్లు గడువు పొడిగించింది. ఇప్పటికే లింక్ చేయకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. ఎందుకంటే ఆర్ధిక లావాదేవీలు, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ నిబంధనలు చాలా అవసరం. ఆదాయపు పన్ను శాఖ 139 ఏఏ ప్రకారం 2017 జూలై 1 నాటికి పాన్ కార్డున్న ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకోవాలి. ఆధార్ నెంబర్‌ను(Aadhaar Card) పాన్ నెంబర్‌తో లింక్ చేయాలి. లేనిపక్షంలో పాన్‌కార్డు చెల్లదు. ఈ నెలాఖరు వరకూ గడువుంది. ఇక డీ మ్యాట్ అక్కౌంట్(D Mat Account) ఉన్నట్లయితే మీ కేవైసీ వివరాల్ని సెప్టెంబర్ 30లోగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే డీమ్యాట్ అక్కౌంట్ డీయాక్టివేట్ అయిపోతుంది. ఇక సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది. ఆటోడెబిట్ కోసం టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ ప్రోసెస్ అక్టోబర్ 1న ప్రారంభం కానుంది.ఇకపై కస్టమర్లకు ఆటోడెబిట్‌కు సంబంధించి 5 రోజుల ముందు సమాచారం వస్తుంది. ఆ ప్రకారం పెండింగ్ పనుల్ని పూర్తి చేసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. బ్యాంకులు, ప్రభుత్వాలు ఆర్ధికపరమైన విషయాల్లో గడువు పెంచుకుంటూ వస్తున్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే పెండింగ్ పనుల్ని సెప్టెంబర్ 30లోగా పూర్తి చేసుకుంటే మంచిది.


Also read: Jharkhand road accident: బస్సు, కారు ఢీ.. మంటల్లో ఐదుగురు సజీవ దహనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook