Indian Students In Ukraine: ఉక్రెయిన్ నుంచి భారతీయుల్ని వెనక్కి రప్పించే ప్రక్రియకు విఘాతం ఏర్పడింది. ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌పై బ్యాన్ విధించడంతో ఇండియా విమానం వెనుదిరగడం ఆందోళన కల్గిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడందరి దృష్టి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై పడింది. రష్యా బాంబు దాడులు ఉధృతమయ్యాయి. ఇప్పటికే రాజధాని కీవ్ నగరం సహా పలు కీలకమైన నగరాలపై దాడులు జరిగాయి. ఉక్రెయిన్ పార్లమెంట్, ప్రభుత్వ ఏజెన్సీల వెబ్‌సైట్లపై సైబర్ దాడులు కూడా చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్‌లోని ఎయిర్‌స్పేస్‌లను రష్యా టార్గెట్ చేస్తుండటంతో ఉక్రెయిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్టుల్ని, గగనతలాన్ని మూసివేస్తూ ఉక్రెయిన్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధుల్ని వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియకు విఘాతం ఏర్పడింది. కీవ్ నగరానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం వెనుదిరిగింది.



ఇప్పటికే 182 మంది ఇండియన్స్ ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. మరి కొంతమందిని తీసుకొచ్చేందుకు ఇవాళ ఉదయం 7 గంటల 30 నిమిషాలకు ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి ఏఐ 1947 విమానం బయలుదేరింది. అదే సమయంలో కీవ్ నుంచి మరో విమానం ఇవాళ ఉదయం 7 గంటల 45 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంది. ఈలోగా గగనతలాన్ని మూసేస్తున్నట్టు ఉక్రెయిన్ ప్రకటించడంతో..ఇండియా నుంచి బయలుదేరిన విమానంపై సందిగ్దత ఏర్పడింది. విమానాన్ని ఉక్రెయిన్‌కు పంపించాలా లేదా వెనక్కి రప్పించాలా అనే విషయంపై రక్షణశాఖ చర్చించింది. చివరికి విమానాన్ని వెనక్కి పిలిపించేందుకే సిద్ధమవడంతో విమానం మధ్యలోంచే వెనుదిరిగింది. అటు ప్యారిస్ పర్యటనలో ఉన్న విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ ఇండియాకు తిరుగుపయనమయ్యారు. 


ప్రస్తుతం ఉక్రెయిన్ నుంచి సాధారణ విమాన రాకపోకలు కొనసాగడం లేదు. ఈ తరుణంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్ధుల పరిస్థితి ప్రశ్నార్ధకమైంది. ఉక్రెయిన్ గగనతలం బ్యాన్ కావడంతో విద్యార్ధుల్ని తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధుల పరిస్థితిపై ఆ విద్యార్ధుల కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల్లో ఆందోళన అధికమైంది. ఎయిర్‌స్పేస్ బ్యాన్ అయినందున విద్యార్ధుల్ని ఎలా వెనక్కి రప్పిస్తారనేది సందేహంగా మారింది. 


Also read: Russia-Ukraine War Effect: ఏప్రిల్ నుంచి భారీగా పెరగనున్న ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook