ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన ప్రారంభించిందని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగానే బీహార్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఇంతిఖబ్ ఆలం, బుధవారం సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొంటూ.. గ్రామీణ స్థాయిలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ, జనం మనకు (కాంగ్రెస్) ఎందుకు ఓటేయడం లేదో అడుగుదామని, ఇందుకోసం దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ఓటర్లను కలిసే కార్యక్రమాన్ని చేపడదామని కోరారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది.


దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ ప్రాంతీయ పార్టీలకు వెళ్లిపోతున్నాయని ఆలం తన లేఖలో పేర్కొన్నారు. అసలు ఓటర్లు కాంగ్రెస్ పట్ల ఎందుకు అసంతృప్తితో ఉన్నారని, ఎందుకు పార్టీకి ఓటేయడం లేదన్నది అడిగి తెలుసుకుందామని సూచించారు. గల్లీ నుండి  ఢిల్లీ స్థాయికి (పంచాయత్ టు నేషనల్ లెవల్) పేరిట కార్యక్రమాన్ని చేపట్టాలని కోరినట్టు లేఖలో పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..