కుమారస్వామికి కర్ణాటక సీఎం పోస్టు దక్కనుందా..?
కర్ణాటక ఎన్నికల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. ఒకవేళ బీజేపీ మెజారిటీ మార్కు దాటలేకపోతే జేడీఎస్‌తో కాంగ్రెస్ జతకట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
కర్ణాటక ఎన్నికల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. ఒకవేళ బీజేపీ మెజారిటీ మార్కు దాటలేకపోతే జేడీఎస్‌తో కాంగ్రెస్ జతకట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. జేడీఎస్ నేత కుమారస్వామికి సీఎం పోస్టు ఇచ్చైనా సరే.. బీజేపీని గెలవకుండా చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉన్నట్లు కనబడుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ తాము జేడీఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమే అని తెలిపారు.
ప్రస్తుతం బీజేపీ 106 సీట్లతో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 73 సీట్లలో..జేడీఎస్ 41 సీట్లలో ముందంజలో ఉంది. ఎలాగైనా కాంగ్రెస్ గెలవాలని భావిస్తుంది కాబట్టి.. జేడీఎస్ పార్టీతో ఎలాంటి ఒప్పందం చేసుకోవడానికైనా వెనుకాడడం లేదని.. ఆఖరికి కుమారస్వామికి సీఎం పదవి ఇవ్వడానికి కూడా వెనుకడుగు వేయడం లేదని సమాచారం. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి సిద్ధరామయ్య ఇప్పటికే బాదామిలో గెలిచి చాముండేశ్వరిలో ఓడిపోయారు.