ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారు కాంగ్రెస్ పార్టీ తల ప్రాణం తోకకు వస్తోంది. మూడు రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో సీఎం అభ్యర్ధి విషయంలో ఒక క్లారిటీ వచ్చింది..యువకుడైన జ్యోతిరాధిత్య సిందియాను కాదని అనుభవజ్ఞుడైన కమాల్‌నాథ్ కే సీఎం అభ్యర్ధిగా నిర్ణయించారు. ఇప్పుడు రాజస్థాన్ సీఎం అభ్యర్ధిత్వంపై రాహుల్ సీరియస్ గా దృష్టి సారించారు. అయితే ఇక్కడ కర వమంటే కప్పుకు కోపం వీడమంటే పాముకు కోపం అన్న చందంగా ఉంది పరిస్థితి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీనియర్ వర్సెస్ జూనియర్
రాజస్థాన్ లో కూడా సరిగ్గా  మధ్యప్రదేశ్ తరహా పరిస్థితి నెలొంది . సీఎం అభ్యర్ధి రేసులో మధ్యప్రదేశ్ లాగే ఇక్కడ కూడా ఒక సీనియర్ ..ఒక జూనియర్ పోటీ పడుతున్నారు. ఒకరు 2 స్లార్లు సీఎంగా పనిచేసిన అనుభవమున్న వ్యక్తి అయితే..మరోకరు పీసీసీ చీఫ్ గా ఉండి రాజస్థాన్ లో పార్టీని ముందుండి నడిపించిన వ్యక్తి. ఒకరు 67 ఏళ్ల ఆశోక్ గెహ్లాట్ అయితే మరోకరు యువకుడైన సచిన్ పైలట్. అయితే ఇక్కడ యువ రక్తానికి ప్రాధాన్యత ఇస్తారా..అనుభవానికి పెద్దపీట వేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది


ఆశోక్ గెహ్లాట్ వైపే అధిష్టానం మొగ్గు ?
ఈ విషయంపై సీరియస్ గా దృష్టిసారించిన రాహుల్ గాంధీ నిన్న సచిన్ పైలట్ మరియు ఆశోక్ గెహ్లాట్ లతో విడివిడిగా సమావేశమయ్యారు. ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా సర్దుకు పోవాలని సూచించినట్లు రాజకీయవర్గాల నుంచి సమాచారం. ఇక్కడ కూడా మధ్యప్రదేశ్ తరహా అనుభవానికి పెద్దపేట వేయాలని ప్రాధమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు


సచిన్ పైలట్ తిరుగుబాటు తప్పదా ?
ఒక వేళ సీరియారిటికి పెద్దపీఠ వేసి ఆశోక్ గెహ్లాట్ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే సీఎం పీఠంపై బోలెడు ఆశలుపెట్టకున్న యువ నాయకుడు సచిన్ పైలట్ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారంది. జ్యోతిరాధిత్య సింధియా తరహా అధిష్టాన నిర్ణయాన్ని తలొగ్గుతారా ? తిరుగబడారా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. సీఎంగా ఆశోక్ గెహ్లాట్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేస్తున్నారనే పుకార్లు రావడంతో దీన్ని అడ్డుకునే వ్యూహం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సచిన్ పైలట్ అనుచరుడిగా ముద్రపడ్డ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంద్రమోహన్ సింగ్ ..సీఎంగా అభ్యర్ధిత్వానికి సచిన్ పైలట్ పేరును ఇంకా ప్రకటించకపోడాన్ని నిరసిస్తూ ఏకంగా రాహుల్ గాంధీకి తన రాజీనామా లేఖ పంపించారు. కొందరు యువకులు రోడ్లపై వచ్చి రాస్తారోకో చేపడతున్నారు. 


 




సచిన్ పైలట్ ప్రమేయంతోనే  జరుగుతోందా ?


ఈ పరిణామాలు సచిల్ పైలట్ ప్రమేయంతో జరుగుతున్నయని కాంగ్రెస్ లోని ఓ వర్గం వాదిస్తోంది. సీఎం అభ్యర్ధిగా సచిన్ పైలట్ ను ప్రకటించకుంటే మున్నుందు ఇలాంటి రాజీనామాలతో పాటు ఆందోళనలు తప్పవని సచిన్ పైలట్ పరోక్షంగా ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారనేది చర్చనీయంశంగా మరింది. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఆయన ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయం కూడా తీసుకున్నారు. అయితే తుది నిర్ణయం తీసుకుంటే ఎలా పరిణామాాలు ఉంటాయో అంచనా వేసిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తారు. త్వరలో లోకసభ ఎన్నికలు కూడా ఉన్నందున రాహుల్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.