Kolkata junior doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో పెనుదుమాంగా మారింది. ఆగస్టు 9 వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పట్ల ఇప్పటికే నిరసనలు కొనసాగుతున్నాయి. ఏకంగా సుప్రీమ్ కోర్టు ధర్మాసనం ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. దారుణం  జరిగిన తర్వాత చోటుచేసుకున్న ప్రతిఒక్క విషయాన్ని కూడా నిశీతంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఇటీవల సుప్రీమ్ కోర్టు...జూనియర్ డాక్టర్ సెమినార్ హల్ లో అత్యంత  దారుణమైన స్థితిలో  కన్పించిన కూడా.. దాన్ని ఆత్మహత్యగా ఎలా ప్రకటిస్తారని ఆర్ జీకర్ ఆస్పత్రి సిబ్బంది పై ప్రశ్నల వర్షం కురిపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు డెడ్ బాడీని దహానంచేసే వరకు కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులను మండిపడింది. ఇక క్రైమ్ సీన్ ను సీల్ చేయాల్సిన బాధ్యత, ఎవిడెన్స్ ను కాపాల్సిన బాధ్యతపై పోలీసులు పూర్తిగా నెగ్లీజెన్స్ చూపించినట్లు స్పష్టంగా కన్పిస్తుందని ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలుచేసింది. వేలాదిగా అల్లరి మూకలు.. ఆర్ జీ కర్ ఆస్పత్రిలో చోరబడుతుంటే.. మమతా సర్కారు ఏంచేస్తోందని కూడా మండిపడింది. దీనికి తోడు.. సీబీఐ కూడా.. క్రైమ్ సీన్ ను పూర్తిగా తారుమారు చేసేలా అక్కడి పరిణామలున్నట్లు నివేదిక సైతం ఇచ్చింది.  దీంతో సుప్రీంకోర్టు మమతా సర్కారుపై ఘాటు వ్యాఖ్యలుచేసింది. మరోవైపు కోల్ కతా మమతా సర్కారుపై.. దేశంలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.


ఒక సీఎం అయి ఉండి.. ఆమె కూడా సామాన్యుల మాదిరిగా నిరసలనలు వ్యక్తం చేయడమేంటని కూడా విమర్శించారు. అంతేకాకుండా.. ప్రస్తుతం కోల్ కతా తీరుపు కొంత మంది సొంత పార్టీ నేతలతో పాటు.. అపోసిషన్ పార్టీలు సైతం  మమతా సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మమతా సర్కారు తరపున వాదనలు విన్పించేందుకు.. 21 మంది ఫెమస్ లాయర్లను నియమించింది. ఇందులో.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఉన్నారు. బెంగాల్ తరపున ఆయన  సుప్రీంకోర్టులో తనవాదనలు విన్పిస్తున్నారు.


ఈ క్రమంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత..అధిర్ రంజన్ చౌదరీ.. కపిల్ సిబాల్ కు ఈకేసు నుంచి తప్పుకొమ్మని కూడా రిక్వెస్ట్ చేశారంట.  అదే విధంగా కపిల్ సిబల్ జూనియర్ డాక్టర్ కేసు విచారణ నేపథ్యంలో ఆయన వెటకారంగా పలుమార్లు నవ్వారు. ఇది కూడా దేశంలో పలు విమర్శలకు తావిచ్చిందని చెప్పుకొవచ్చు. దీంతో కపిల్ సిబాల్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.


Read more: Kolkata murder case: వేశ్యల ఇంట్లోని మట్టితో దుర్గా విగ్రహాల తయారీ.. సోనాగచి సెక్స్ వర్కర్ లు ఏమంటున్నారంటే..?


గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కపిల్ సిబల్ కేంద్ర మంత్రిగా.. అంతేకాకుండా అత్యంత కీలకమైన మానవ వనరుల శాఖ మంత్రిగా ఆయన పని చేశారని తెలిపారు.ఈ క్రమంలో.. ఈ కేసు నుంచి వైదొలగాలని కపిల్ సిబల్‌కు అధిర్ రంజన్ చౌదరి సూచించినట్లు తెలుస్తోంది. ఇక వైద్యురాలిపై హత్యాచారం అనంతరం సీఎం మమతా బెనర్జీ మృతురాలి తల్లిదండ్రులతో వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా అధిర్ రంజన్ చౌదరి ఫైర్ అయ్యారు. మరోవైపు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం ఇప్పటికే ఈ ఘటనపై మమతా సర్కారుకు ఫైర్ అయ్యారు. 



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter