పాట్నా: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కుట్రపన్నారని బీహార్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్యామ్ సుందర్ సింగ్ ధీరజ్ ఆరోపించారు. నలుగురు పార్టీ నేతలు, పలు మిత్రపక్షాలను పార్టీ ఓటమికి బాధ్యులుగా శ్యామ్ సుందర్ సింగ్ వేలెత్తిచూపించారు. అధికమొత్తంలో డబ్బులు ఇచ్చిన వారికే పార్టీ టికెట్స్ అమ్ముకున్న నేతలు.. పార్టీ కోసమే పనిచేసే వారికి రాహుల్ గాంధీని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే పార్టీ హైకమాండ్‌ని చీకటిపాలు చేశారని శ్యామ్ సుందర్ ఆవేదన వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీ రాజీనామా చేయోద్దని డ్రామా ఆడుతున్న వారిలోనూ ఆయనకు ద్రోహం చేసిన వారు ఉన్నారని శ్యామ్ సుందర్ పేర్కొన్నారు.


ఎన్డీఏ కూటమితోపాటు నరేంద్ర మోదీక వ్యతిరేకంగా పనిచేస్తామని ప్రతిజ్ఞపూనిన వారే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ద్రోహం చేశారని ఆరోపించిన శ్యామ్ సుందర్.. ఆ నేతలు ఎవరు ? ఏంటనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.