పాట్నా: మోటార్ వాహనాల (సవరణ) చట్టం-2019 అమలులోకి వచ్చాకా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నేరం తీవ్రత ఆధారంగా భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీహార్‌ రాజధాని పాట్నాలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అక్కడి ట్రాఫిక్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్యే అబిదుర్ రెహ్మాన్‌ హెల్మెట్ ధరించకుండా ఓ మోటారుసైకిల్‌ వెనుక సీటుపై కూర్చుని ప్రయాణిస్తూ ట్రాఫిక్ పోలీసుల కంటపడ్డారు. అది చూసిన పోలీసులు.. ఆయన్ని ఆపి రూ.1000 చలానా విధించారు. 


ద్విచక్రవాహనానికి సంబంధించిన పేపర్లన్నీ సరిగానే ఉన్నప్పటికీ ఆయన వెనుక సీట్లో హెల్మెట్ లేకుండా కూర్చొన్నందున అపరాధ రుసుము విధించినట్టు పాట్నా పోలీసు అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.