RAHUL UK TOUR: సమాధానం చెప్పలేక సారీ.. రాహుల్ ను అంతగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఏంటో?
RAHUL UK TOUR: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భారత్ లోని మోడీ ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాందీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఓ ఇంటర్వూలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక.. సైలెంట్ గా కూర్చుండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
RAHUL UK TOUR: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. లండన్‌లో బిజీబిజీగా ఉన్న ఉన్న రాహుల్.. పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భారత్ లోని మోడీ ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాందీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఓ ఇంటర్వూలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక.. సైలెంట్ గా కూర్చుండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
బ్రిటన్ లో రాహుల్ గాంధీని అంతగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఏంటో తెలుసా.. భారత సమాజంలో హింస, అహింస అంశంపై ఆయన అభిప్రాయం చెప్పమనడమే. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన ఇంటర్వ్యూలో భారత్ లో హింస, అహింసపై అభిప్రాయం ఏంటని రాహుల్ ను ప్రశ్నించారు. ఈ ప్రశ్న రావడంతో రాహుల్ ఒక్కసారిగా షాకయ్యారు. ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చేందుకు తడబడ్డారు. ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డారు. మౌనంగా అలా ఉండిపోయారు. కాసేపటికి తేరుకుని సమాధానం ఇచ్చారు.ఈ విషయంలో తనకు మొదటగుర్తొచ్చే పదం క్షమాపణ.. ఇది కచ్చితమైందేమీ కాదు అని సమాధానమిచ్చి మళ్లీ ఆగిపోయారు రాహుల్ గాంధీ. దీంతో రాహుల్ ను ఉత్సాహ పరిచేందుకు అక్కడున్న ప్రేక్షకలు చప్పట్లు కొట్టారు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పేందుకు ఆలోచిస్తున్నా అంటూ ప్రేక్షకులకు చెప్పారు రాహుల్ గాంధీ. రాహుల్ పరిస్థితిని గమనించిన ఇంటర్వూవర్.. ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని అన్నారు. ఇంతకుముందు ఇలాంటి క్వశ్చన్ ఎవరూ అడిగి ఉండకపోవచ్చంటూ రాహుల్ గాంధీకి సారీ చెప్పారు. దీనిపై వెంటనే స్పందించిన రాహుల్.. అలాంటేది లేదు.. ఈ ప్రశ్నకు సమగ్రంగా సమాధానం ఇచ్చేందుకు ట్రై చేస్తున్నానని తెలిపారు. ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రాహుల్ గాంధీ ఇంటర్వ్యూకు సంబంధించిన అంశంపై బీజేపీ స్పందించింది. రాహుల్ వీడియోను ట్వీట్ చేసిన బీజేపీ నేత అమిత్ మాలవీయ.. ముందుగా రాసిపెట్టుకున్న అంశాలపై రాహుల్ మాట్లాడితే బెటరని కామెంట్ చేశారు. ఈ అంశంలో రాహుల్ కు కాంగ్రెస్ నేతలు అండగా నిలిచారు. ఉగ్రవాదుల దాడుల్లో నానమ్మ, తండ్రిని కోల్పోయిన రాహుల్ బాధను బీజేపీ అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నా.. ఆయనకు ఎదురైన ప్రశ్నను క్షమాపణ అనే ఒకే ఒక్క పదంతో వివరించారని అని రణ్‌దీప్ సూర్జేవాలా కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు రాహుల్ గాంధీ బ్రిటన్ పై వివాదం జరుగుతోంది. లండన్ వెళ్లేముందు రాహుల్ గాంధీ భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. విదేశీ పర్యటన చేసే ప్రతి పార్లమెంట్ సభ్యుడు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. రాహుల్ గాంధీ మాత్రం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రైవేటు కార్యక్రమాలకు పొలిటికల్ క్లియరెన్స్ అవసరం లేదని బీజేపీ ఆరోపణలకు కాంగ్రెస్ కౌంటరిస్తోంది.
READ ALSO: TSRTC OFFER: ప్రయాణికులకు సూపర్ న్యూస్.. జర్నీకి 15 నిమిషాల ముందు రిజర్వేషన్!
READ ALSO: TDP MAHANADU: పొత్తులపై టీడీపీ మహానాడులో కీలక తీర్మానం? అమలాపురం అల్లర్లపై ప్రత్యేక చర్చ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook