పెళ్లికి బీజేపీ అనుమతి తీసుకోండి: రందీప్
బిజెపిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రందీప్ సుర్జెవాలా బుధవారం బీజేపీ ఎంఎల్ఏ విరుష్క వివాహంపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు.
న్యూఢిల్లీ: బిజెపిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రందీప్ సుర్జెవాలా బుధవారం బీజేపీ ఎంఎల్ఏ విరుష్క వివాహంపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు. యువతీ, యువకులు వివాహం చేసుకోవాలంటే ముందుగా అధికార పార్టీ నుండి అనుమతి తీసుకోవాలేమో? అని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ శాసనసభ్యుడు పన్నలాల్ శక్యా మంగళవారం నాడు విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకోవడంపై విమర్శలు చేశారు.
అటెంగ్షన్ ప్లీజ్.. యువతీ, యువకులకులారా..! ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎక్కడ వివాహ వేదికను ఏర్పాటుచేసుకోవాలో, పెళ్లి కార్యం ఎలా జరుపుకోవాలో, విందులో ఏమేమి ఉండాలో బీజేపీ నుండి అనుమతి తీసుకోండి. ధన్యవాదాలు" అంటూ సుర్జెవాలా ట్వీట్ చేశాడు.