అలహాబాద్: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ప్రారంభమవుతుందని మాజీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీ, రామ జన్మభూమి నయాస్ అధ్యక్షుడు రామ్ విలాస్ వేదాంతి చెప్పారు. 'అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు భారతీయ జనతా పార్టీ దృఢ నిశ్చయంతో ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే రామాలయ నిర్మాణం ప్రారంభమవుతుంది' అని తనను కలిసిన విలేకర్లతో రామ్ విలాస్ వేదాంతి అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జూలైలో హైదరాబాద్‌లో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు రామ మందిరం నిర్మించనున్నట్లు స్పష్టంగా చెప్పారని నివేదికలు పేర్కొనగా.. అమిత్ షా అలా అనలేదని బీజేపీ పార్టీ నేతలు పేర్కొన్నారు.  జూన్ 25న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. రామమందిర నిర్మాణానికి స్వయంగా రాముడే దీవెనలు అందిస్తాడని.. అప్పుడే అయోధ్యలో రామ మందిరం నిర్మించనున్నట్లు చెప్పారు.


1528లో అయోధ్యలో మొఘల్ చక్రవర్తి బాబర్ బాబ్రీ మసీదును నిర్మించారు. 1992 డిసెంబర్ 6న కొంతమంది హిందూ ఉద్యమకారులు ఈ మసీదును ధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్న రామ మందిరాన్ని కూలగొట్టి.. బాబర్ మసీదు నిర్మించారని హిందుత్వ సంస్థల ఆరోపణ. కాగా ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది.