India Records 7830 New Covid-19 Cases: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు. కోవిడ్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. మంగళవారం 5,676 కేసులు నమోదవ్వగా.. బుధవారం ఈ సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో దేశంలో 7,830 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40,215కి చేరింది. ఇప్పటివరకు కరోనా సోకినవారిన సంఖ్య 4,47,76,002కి చేరింది. గత 223 రోజుల తరువాత నమోదైన అత్యధిక రోజువారీ కేసులు ఇవే గమనార్హం. గతేడాది సెప్టెంబర్ 1న దేశంలో అత్యధికంగా 7,946 రోజువారీ కరోనా కేసులు రాగా.. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో కోవిడ్ కేసులు వచ్చాయ. తాజాగా కరోనా కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ మృతుల సంఖ్య 5,31,016కి చేరింది. కోవిడ్-19 మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దేశంలో 40,215 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. ఇది మొత్తం కేసులలో 0.9 శాతం అని చెప్పారు. కరోనా రోగుల రికవరీ రేటు 98.72 శాతంగా ఉందని.. ఇప్పటివరకు మొత్తం 4.42 కోట్ల మంది కరోనా మహమ్మారిని ఓడించారు. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల మంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
 
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని ప్రజలకు సూచిస్తోంది. శానిటైజర్‌లను తరచుగా వాడాలని.. సామాజిక దూరం పాటించాలని కోరుతోంది. మంగళవారం ఢిల్లీలో 980 కేసులు నమోదైన విషయం తెలిసిందే. పాజిటివిటీ రేటు 25.98 శాతంగా ఉండడంతో ఆందోళన నెలకొంది. ఢిల్లీలో కరోనాతో ఇద్దరు చనిపోయారు. హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో కూడా నిబంధనలు కఠినతరం చేశారు. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మాల్స్, ప్రైవేట్ కార్యాలయాల్లో మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.


Also Read: DC Vs MI Highlights: హైఓల్టెజ్ మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌ విక్టరీ.. ఢిల్లీకి నాలుగో ఓటమి    


కరోనా కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో సీరమ్ ఇన్సిస్టిట్యూట్ కోవోవాక్స్ వ్యాక్సిన్‌ను హెటెరోలాగస్ బూస్టర్ డోస్‌గా అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. కోవిన్ యాప్‌లో బుక్ చేసుకుని.. కోవోవాక్స్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ అన్ని వేరియంట్‌లకు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పటికే యూఎస్, యూరోప్‌ దేశలలో ఆమోదించారు. తాజాగా భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. కోవాక్స్ డోసుకు రూ.225 ఖర్చు అవుతుంది. దీనిపై జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 


Also Read: Fastest 50 in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన టాప్-5 ప్లేయర్లు వీళ్లే..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి