Corona Fourth Wave: కోవిడ్ ఫోర్త్‌వేవ్ ఆందోళన పట్టుకుంది ఇప్పుడు అందరికీ. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ ఫోర్త్‌వేవ్ జూన్-జూలై నెలల్లో ప్రారంభం కానుందని చెబుతున్నారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. తిరిగి అన్ని కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే కరోనా ఫోర్త్‌వేవ్ హెచ్చరికలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. కాన్పూర్ ఐఐటీ విభాగం చేసిన హెచ్చరిక వెంటాడుతోంది. ఈ సమయంలో కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ మరోసారి కోవిడ్ ఫోర్త్‌వేవ్ గురించి ప్రస్తావించారు. జూన్-జూలై నెలల్లో కోవిడ్ ఫోర్త్‌వేవ్ ప్రారంభమై..సెప్టెంబర్ వరకూ కొనసాగుతుందని సూచించారు. కర్ణాటక ఫోర్త్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు.


ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కోవిడ్ 10 కొత్త ఎక్స్‌ఈ వేరియంట్ 8 దేశాల్లో ఉందని..ఆ దేశాల్నించి వచ్చేవారిపై దృష్టి పెడుతున్నామన్నారు. మాస్క్ ఇప్పటికీ అవసరమని..ఆ విషయంలో ఏ విధమైన మినహాయింపు లేదని చెప్పారు. అయితే కరోనా ఫోర్త్‌వేవ్ గురించి చింతించాల్సిన అవసరం లేదన్నారు. చిన్నారులకు ఇచ్చే వ్యాక్సిన్లు ప్రపంచంలోని ఇతర దేశాల్లో అందుబాటులో వచ్చిన చాలాకాలం తరువాత ఇండియాలో వచ్చాయన్నారు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ 1985లో ప్రపంచంలో ప్రారంభమైతే..ఇండియాలో మాత్రం 2005 వరకూ రాలేదన్నారు. ఇక బీసీజీ వ్యాక్సిన్ విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే 20-25 ఏళ్ల తరువాత ఇండియాలో వచ్చిందన్నారు. 


ప్రస్తుతం ఇండియాలో అనుమతించిన 10 వ్యాక్సిన్లలో ఒకటి మేకిన్ ఇండియా కోవాగ్జిన్ కావడం దేశానికి గర్వకారణమని చెప్పారు. ఇక పూణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, జైడస్ క్యాడిలా కంపెనీ వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. 


Also read: Nitish kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ సభకు సమీపంలో బాంబు దాడి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook