Corona Spreading Rate: కరోనా మహమ్మారి ఎంతగా విలయం సృష్టిస్తున్నా ప్రజల వైఖరిలో మార్పు రావడం లేదు. దేశంలో కరోనా సంక్రమణ సామర్ధ్యం పెరుగుతుండటం కరోనా థర్డ్‌వేవ్‌కు సంకేతంగా నిలుస్తోంది. ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్ అనివార్యమనే పరిస్థితులు వస్తున్నాయా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి తగ్గుముఖం పట్టిందనుకునేలోగా కరోనా థర్డ్‌వేవ్ ముప్పు వెంటాడుతోంది. కరోనా ఫస్ట్‌వేవ్ నుంచి గుణపాఠం నేర్చుకోపోవడమే కరోనా సెకండ్ వేవ్‌కు కారణంగా మారింది. కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టించినా సరే జనం వైఖరిలో మార్పు రాలేదు. కోవిడ్ జాగ్రత్తల్ని ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారు. గుంపులు గుంపులుగా తిరగడం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్ ధరించకపోవడం ఇలా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కరోనా సంక్రమణ నెమ్మదిగా పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా సంక్రమణ సామర్ధ్యం అంటే ఆర్ వాల్యూ పెరుగుతోంది. ఇదే ఇప్పుడు ఆందోళనకు కారణంగా మారింది.


కరోనా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే సామర్ధ్యాన్నే(Coronavirus Spread) ఆర్ వాల్యూగా పిలుస్తారు. ఆర్ వాల్యూ 0.72 ఉంటే..ప్రతి వందమంది బాధితుల్నించి 72 మందికి కరోనా వ్యాధి సంక్రమిస్తున్నట్టు లెక్క. జూన్ నెలాఖరు వరకూ కరోనా సంక్రమణ రేటు అంటే ఆర్ వాల్యూు తగ్గుతూ వచ్చింది. జూన్ 20-జూన్ 27 మధ్య పెరిగింది. మే 15వ తేదీకు ఆర్ వాల్యూ 0.78గా ఉండగా..జూన్ 26 వాటికి 0.88కు చేరుకుంది. చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆర్ వాల్యూ తగ్గితే..కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నట్టు లెక్క. ఆర్ వాల్యూ 1 దాటిందంటే ప్రమాదకరంగా ఉన్నట్టే పరిస్థితి. రోజుకు నాలుగు లక్షల కేసుల్నించి 40 వేలకు కేసులు తగ్గిపోయాయి. ఓ దశలో రోజుకు 35 వేలకు కూడా పడిపోయిన పరిస్థితి. మళ్లీ గత రెండ్రోజుల్నించి 40-45 వేల మధ్య కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కేరళ, మహారాష్ట్రల నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కేరళలో ఆర్ వాల్యూ 1.1గా ఉంటే..మహారాష్ట్రలో 1గా ఉంది. ఈ పరిస్థితి కచ్చితంగా కరోనా థర్డ్‌వేవ్‌(Corona Third Wave)కు సంకేతాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 


Also read: Solar Storm: అతి భయంకర వేగంతో సౌర తుపాను, ఇవాళ లేదా రేపు భూమిపై ఎటాక్, తస్మాత్ జాగ్రత్త


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook