Omicron Threat: అజాగ్రత్త వహిస్తే..ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రమాదమే
Omicron Threat: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత అంతగా లేదని చెబుతున్నా..ప్రమాదం పొంచే ఉందనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
Omicron Threat: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత అంతగా లేదని చెబుతున్నా..ప్రమాదం పొంచే ఉందనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
దేశంలో కరోనా విలయ తాండవం ప్రారంభమైంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో పాటు డెల్టా వేరియంట్ కూడా వెలుగుచూస్తోంది. ఒమిక్రాన్ తీవ్రత అంతగా ఉండదనే అభిప్రాయంతో అజాగ్రత్తగా ఉండవద్దని తాజాగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ ప్రభు కుమార్ వ్యాఖ్యలు కలవరం కల్గిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌తో ఏ మాత్రం అజాగ్రత్త వద్దని సూచిస్తున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక సమస్యలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై..డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్‌ల ప్రభావం ఒకేలా ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) చాలావరకూ సాధారణ జలుబులా వచ్చి వెళ్లిపోతుందని..అలాగని అజాగ్రత్త వద్దని హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాల్లో ఎక్కువగా గొంతు నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, కాళ్ల నొప్పులుంటున్నాయని చెప్పారు. ఎవరికైతే 2-3 రోజుల్లో వైరస్ తీవ్రత తగ్గదో..ఆక్సిజన్ లెవెల్స్ 95 శాతం కంటే తగ్గుతుందో వారు కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలని కోరుతున్నారు. డెల్టా వేరియంట్ సోకితే మాత్రం ప్రమాదం ఎక్కువేనంటున్నారు. కరోనా కొత్త మ్యూటేషన్లు వచ్చే అవకాశాల్ని తోసిపుచ్చలేమన్నారు.
ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలతోనే ప్రభావం చూపుతోందని చెప్పి అజాగ్రత్తగా ఉండవద్దని హెచ్చరిస్తున్నారు. రానున్న మూడు వారాలు అనవసర ప్రయాణాల్ని నియంత్రించి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ప్రభు కుమార్ చెబుతున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల్లో నిర్లక్ష్యం వల్లనే కేసులు భారీగా పెరిగాయని చెబుతున్నారు. అన్ని దేశాల్లోనూ డెల్టా వేరియంటా్ (Delta Variant)కంటే అధికంగా ఒమిక్రాన్ వేరియంట్ 95 శాతం కేసులు నమోదైతే..కరోనా దాదాపుగా తగ్గిపోతుందని అంచనా ఉంది. నెదర్లాండ్స్, అమెరికా, యూకేల్లో 95 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే ఉంటున్నాయి. ఇండియాలో ఆ పరిస్థితి ఇంకా రాలేదు. వందేళ్ల క్రితం సంభవించిన స్పానిష్ ఫ్లూ కూడా...నాలుగు వేవ్‌ల తరువాత ముగిసింది. ఇప్పుడు కరోనా విషయంలోనూ అదే పునరావృతం కావచ్చని నిపుణుల అంచనా.
Also read: Election Survey: ఇప్పుడు ఎన్నికలొస్తే ఎవరిది అధికారం, సీ ఓటర్ - ఇండియా టుడే సర్వే ఏం చెబుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook