PM Meet: కరోనా థర్డ్‌వేవ్ ముప్పు, ఆరు రాష్ట్రాల సీఎంలతో ఈ నెల 16న ప్రధాని మోదీ భేటీ
PM Meet: దేశంలో కరోనా మహమ్మారి ముప్పుకు సంబంధించి ప్రమాద సంకేతాలు వెలువడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ తప్పదన్న ఐఎంఏ హెచ్చరికల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ అవుతున్నారు.
PM Meet: దేశంలో కరోనా మహమ్మారి ముప్పుకు సంబంధించి ప్రమాద సంకేతాలు వెలువడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ తప్పదన్న ఐఎంఏ హెచ్చరికల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ అవుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)నుంచి పూర్తిగా కోలుకోకముందే కరోనా థర్డ్‌వేవ్ ముప్పు హెచ్చరిస్తోంది. తాజాగా ఐఎంఏ (IMA)హెచ్చరికల నేపధ్యంలో ఆందోళన మరింత ఎక్కువైంది. ఇప్పటికే ఉత్తరాదిలోని పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా థర్డ్‌వేవ్ నేపధ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కరోనా థర్డ్‌వేవ్‌కు(Corona third wave)తోడుగా..కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్లపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వేరియంట్లను ట్రాక్ చేయడం, వైరస్ మ్యూటేషన్‌పై కఠిన పర్యవేక్షణ తప్పనిసరి అని మోదీ సూచించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మోదీ (Pm Modi) సమీక్షించారు. పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షల అవసరాన్ని గుర్తు చేశారు.
ఇప్పుడు మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో (Modi meeting with cm's) సమావేశం కానున్నారు. ఈ నెల 16 వతేదీన ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా భేటీ కానున్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీకు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. దక్షిణాదిన తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాలు సమావేశంలో పాల్గొంటున్నాయి.
Also read: Prashant kishor: రాహుల్ గాంధీ, ప్రియాంకాలతో పీకే భేటీ, దేనికి సంకేతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook