Cororna Third Wave: కరోనా థర్డ్‌వేవ్ ఇండియాలో ఎప్పుడనే విషయంపై స్పష్టత
Cororna Third Wave: కరోనా మహమ్మారి తగ్గుతున్న వేళ థర్డ్‌వేవ్ అంచనాలు మరోసారి భయపెడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ ఎప్పుడొస్తుందనే విషయంలో విభిన్న వర్గాల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది రాయిటర్స్ సంస్థ అంచనా వేసింది. ఆ అంచనా ప్రకారం దేశంలో థర్డ్‌వేవ్..
Cororna Third Wave: కరోనా మహమ్మారి తగ్గుతున్న వేళ థర్డ్‌వేవ్ అంచనాలు మరోసారి భయపెడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ ఎప్పుడొస్తుందనే విషయంలో విభిన్న వర్గాల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది రాయిటర్స్ సంస్థ అంచనా వేసింది. ఆ అంచనా ప్రకారం దేశంలో థర్డ్‌వేవ్..
ఇండియాల ఇప్పుడు కోవిడ్ 19 సెకండ్ వేవ్(Corona Second Wave) తగ్గుముఖం పట్టింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కేసులు తగ్గుతున్నాయి. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో రాయిటర్స్ సంస్థ వివిధ కోణాల్లో విభిన్న రకాల నిపుణులు అంచనాలు సేకరించింది. కరోనా ధర్డ్‌వేవ్ దేశంలో ఎలా ఉండబోతుంది.ఎప్పుడు వచ్చే అవకాశాలున్నాయనే విషయాల్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 40 మంది వైద్యరంగ నిపుణులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ఎపిడమాలజిస్టులు, ప్రొఫెసర్ల అభిప్రాయాల్ని సేకరించి నివేదిక వెలువరించింది. ఇండియాలో మొదటి రెండు వేవ్‌లు ఎలా మొదలై..ఎలా కేసులు పెరిగాయి..ఎలా తగ్గాయనేది పరిశీలించింది. ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్ కచ్చితంగా అక్టోబర్ నెలలో వస్తుందని రాయిటర్స్ స్పష్టం చేసింది. ఇండియా.. కరోనా సెకండ్ వేవ్ కంటే థర్డ్‌వేవ్‌ను(Corona Third Wave)సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేసింది. మరో ఏడాది ప్రజారోగ్యానికి సవాలేనని తెలిపింది.
జూన్ 3-7 తేదీల మధ్య రాయిటర్స్ సంస్థ నిపుణుల అభిప్రాయాల్ని సేకరించింది. 85 శాతం మంది కచ్చితంగా అక్టోబర్ నెలలో కరోనా థర్డ్‌వేవ్ వస్తుందని తెలిపారు. ముగ్గురు మాత్రం ఆగస్టు నెలలోనే వస్తుందని చెప్పగా..12 మంది సెప్టెంబర్ నెలలో వస్తుందని అంచనా వేశారు. మిగిలినవారు నవంబర్-ఫిబ్రవరి మధ్య కాలంలో కోవిడ్ మరోసారి పంజా విసురుతుందని చెప్పారు. 70 శాతం మంది నిపుణులు ఇండియా కోవిడ్ థర్డ్‌వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే ఎంతోకొంత హార్డ్ ఇమ్యూనిటీ ఏర్పడి ఉంటుందని..మరోవైపు వ్యాక్సినేషన్( Vaccination) ఇస్తున్నందున థర్డ్‌వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని ఎయిమ్స్ సైతం స్పష్టం చేసింది. ఇదే సర్వేలో 40 మంది నిపుణుల్లో 26 మంది చిన్నారులపై థర్డ్‌వేవ్ ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరో ఏడాది కరోనాతో ప్రజలు సహజీవనం చేయాలని..రాయిటర్స్ సంస్థ(Reuters)వెల్లడించింది.
Also read: Corona Active Cases: ఇండియాలో 73 రోజుల కనిష్టానికి చేరుకున్న కరోనా యాక్టివ్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook