Corona Vaccination: దేశంలో కొనసాగుతున్న టీకా ఉద్యమం.. 200 కోట్ల మార్క్ దాటిన వ్యాక్సిన్..!
Corona Vaccination: భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ పంపిణీ కొనసాగుతోంది. ఈక్రమంలో తాజాగా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.
Corona Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌లో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా మరో రికార్డును నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 200 కోట్ల కరోనా డోసులను పంపిణీ చేశారు. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియను మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. 18 నెలల్లోనే 200 కోట్ల డోసులను పంపిణీ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 200 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
[[{"fid":"238197","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. భారత్ మరోసారి చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్‌లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు యావత్తు భారత్ ఎంతో కృషి చేసిందని..ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు ప్రధాని మోదీ. దేశంలో కరోనా వ్యాక్సిన్‌కు అర్హులైన వారిలో 98 శాతం మంది కనీసం ఒక్క డోసు తీసుకున్నారు. 90 శాతం మంది రెండు డోసులను పూర్తిగా తీసుకున్నారని అధికారులు తెలిపారు.
దేశంలో ఇప్పటివరకు 51.5 శాతం పురుషులు, 48.9 శాతం మంది మహిళలు వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద కోట్ల మైలురాయిని దాటేందుకు 9 నెలల సమయం పట్టింది. మరో 9 నెలల్లో 200 కోట్ల మార్క్‌ను దాటింది. గతేడాది సెప్టెంబర్ 17న ఒకే రోజు 2.5 కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలో ఇప్పటివరకు 5 కోట్ల 63 లక్షల మంది బూస్టర్ డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం..రాగల మూడురోజులపాటు వర్ష సూచన..!
Also read:India vs England: మూడో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..తుది జట్టు ఇదే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.