బ్రేకింగ్: దేశంలో 15వేలు దాటిన కరోనా కేసులు, 507 మంది మృతి
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 15వేల మార్క్ చేరుకుంది. కోవిడ్19 మరణాల సంఖ్య సైతం 500 దాటింది.
న్యూఢిల్లీ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 15వేల మార్క్ చేరుకుంది. కోవిడ్19 మరణాల సంఖ్య సైతం 500 దాటింది. ఇప్పటివరకూ భారత్‌లో 15,712 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి 507 మంది చనిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. పెళ్లి ఆగిందని వధువు ఆత్మహత్య
ఆదివారం ఉదయం కేంద్ర మంత్రిత్వశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నేటి ఉదయం వరకు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల వివరాలను తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 211 మంది చనిపోగా, 3,651 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో 1,407 కేసులు నమోదుకాగా, 70 మంది మరణించడం గమనార్హం. PHotos: హెబ్బా.. అందాలు చూస్తే అబ్బా!
మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ 1893 కేసులు, 42 మరణాలు, తమిళనాడు 1372 కేసులు, 15 మంది మరణం, రాజస్థాన్ 1351 కరోనా పాజిటివ్ కేసులతో వెయ్యి మార్క్ దాటిన రాష్ట్రాలుగా ఉన్నాయి. గుడ్‌న్యూస్.. బంగారం ధరలు పతనం, వెండి ఢమాల్
కాగా, తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణలో 18 మంది కరోనా బారిన పడి చనిపోయారు. మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 809 చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 647 కేసులు నమోదుకాగా, మొత్తం 17 మంది మృతి చెందారు.
Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos