`కరోనా` అప్డేట్ : లాక్ డౌన్ పొడగించిన ఒడిశా
భారత దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 6 వేలకు చేరింది. ఇవాళ ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 వేల 734గా ఉంది.
భారత దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 6 వేలకు చేరింది. ఇవాళ ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 వేల 734గా ఉంది.
అందులో 166 మంది మృతి చెందారు. 473 మంది కోలుకుని తిరిగి ఇంటికి వెళ్లారు. మిగతా వారు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మహమ్మారిపై రోజు సమీక్షలు నిర్వహిస్తోంది. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. కరోనా వైరస్ పై తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రులు, ఉన్నతాధికారులు చర్చించారు.
మరోవైపు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మృత్యు క్రీడ ఆడుతూనే ఉంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తొలిసారిగా కరోనా బారిన పడి ఓ వైద్యుడు మృతి చెందారు. నిన్నటి వరకు సాధారణ పౌరుల ప్రాణాలు తీసిన కరోనా మహమ్మారి మొట్టమొదటిసారి ఓ వైద్యున్ని పొట్టన పెట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అటు డాక్టర్లపై పోలీసుల దాడులు పెరుగుతున్నాయని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఎయిమ్స్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతూ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ తరఫున లేఖ రాశారు. నిత్యం కరోనా రోగుల చికిత్సకు అంకితమవుతున్న తమపై పోలీసుల దురుసు ప్రవర్తన మంచిది కాదని స్పష్టం చేశారు. అటు కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఏర్పాటు చేసిన లాక్ డౌన్ వ్యవసాయ పనులపైనా పడింది. వ్యవసాయ పనులు చేసేందుకు దేశవ్యాప్తంగా ఎక్కడా కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో రైతన్నలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
[[{"fid":"184124","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను తొలిసారిగా ఒడిశా ప్రభుత్వం పొడగించింది. లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు అమలు చేయనున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఒడిశాలో లాక్ డౌన్ ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. అంతే కాదు ఏప్రిల్ 15 తర్వాత బస్సులు, రైళ్లు తిరిగి ప్రారంభించవద్దని లేఖలో కోరారు. ఒడిశాలో విద్యాలయాలు జూన్ 17 వరకు మూసివేసే ఉంటాయని తెలిపారు.
మరోవైపు కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి తమిళనాడు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. తొలిసారిగా డిస్ ఇన్ఫెక్టెంట్ ను స్ప్రే చేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఐసోలేషన్ కేంద్రాలుగా పని చేస్తున్న రాజాజీ ఆస్పత్రిలో ఈ దృశ్యం కనిపించింది.
[[{"fid":"184125","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]