`కరోనా` సోకిందని భవనంపై నుంచి దూకేశాడు..!!
`కరోనా వైరస్`.. భారత దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. కరోనా రోగులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఈ క్రమంలో వైద్యులు సైతం 24 గంటలు సేవలు అందిస్తున్నారు. పోలీసులు 24 గంటలు రోడ్లపై గస్తీ తిరుగుతున్నారు. మరోవైపు కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని స్వచ్ఛందంగా వైద్యం కోసం రావాలని కోరుతున్నారు. ఒకవేళ కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా రానిపక్షంలో వారి జాడ తెలుసుకుని ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు.
'కరోనా వైరస్'.. భారత దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. కరోనా రోగులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఈ క్రమంలో వైద్యులు సైతం 24 గంటలు సేవలు అందిస్తున్నారు. పోలీసులు 24 గంటలు రోడ్లపై గస్తీ తిరుగుతున్నారు. మరోవైపు కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని స్వచ్ఛందంగా వైద్యం కోసం రావాలని కోరుతున్నారు. ఒకవేళ కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా రానిపక్షంలో వారి జాడ తెలుసుకుని ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు.
పోలీసులు నిత్యం ఇదే పనిలో బిజీగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు వైద్యులు నిరంతరం చికిత్స అందిస్తున్నారు. కానీ కరోనా లక్షణాలతో ప్రజల్లో భయాందోళన విపరీతంగా పెరిగిపోతోంది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి .. కనీసం రిపోర్టు రాకుండానే అదే ఐసోలేషన్ వార్డులో ఉరి వేసుకుని చనిపోయాడు. ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో జరిగిన ఈ ఘటన మరువక ముందే దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘటన జరిగింది.
హైదరాబాద్‌లో 3వీ సేఫ్ టన్నెల్
ఆల్ ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ..AIIMS భవనంపై నుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అదృష్టవశాత్తూ అతని కాలు మాత్రమే విరిగింది. కానీ ప్రాణాపాయం తప్పింది. జై ప్రకాష్ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. ఐతే తన ప్రాణాలను కరోనా హరించివేస్తుందన్న ఆందోళన నేపథ్యంలో ఆయన ట్రామా సెంటర్ మూడో అంతస్తు ఎక్కి అక్కడి నుంచి దూకి బలవన్మరణం చెందేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆయన కరోనా పరీక్షకు సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉంది.
ఈ క్రమంలోనే జై ప్రకాశ్ ఇలా చేయడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐతే కరోనా గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని .. రోగ నిరోధక శక్తి పెంచుకుంటే .. కరోనా పూర్తిగా నయమైపోతుందని వైద్యులు చెబుతున్నారు. ముందుగానే ఆందోళన చెంది ఇలా ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించడం మంచిది కాదంటున్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నా .. ధైర్యంగా ఎదుర్కోవాలని వైద్యులు కోరుతున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..