పాట్నా: వేరే రాష్ట్రానికి వెళ్లొచ్చిన వ్యక్తి వివరాలు చెప్పడంతో ఆవేశానికి లోనై ఏకంగా హత్యకు పాల్పడ్డారు. ఈ దారుణం బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌లోని మధౌల్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రకు కూలీలుగా వలస వెళ్లారు.  కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, దేశంలో 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించడం తెలిసిందే. ఈ క్రమంలో ఆ వలసకూలీలు ఇటీవల తమ సొంత ప్రాంతానికి తిరిగొచ్చేశారు.  శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధౌల్ గ్రామానికి చెందిన బబ్లూ ఆ వలస కూలీల సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న వైద్యశాఖ అధికారులు వారి నుంచి శాంపిల్స్ తీసుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తమ వివరాలను బబ్లూ ఇచ్చాడని వారు పగ పెంచుకున్నారు. మరో నలుగురు వ్యక్తులతో కలిసి బబ్లూపై దాడిచేసి దారుణంగా కొట్టి హత్యచేశారు. పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.  ఏపీలో మరో 17 కరోనా కేసులు


కాగా, దేశంలో కరోనా బాధితుల సంఖ్య సోమవారం నాటికి 1251కి చేరుకుంది. 32 మంది కరోనా కాటుకు బలయ్యారు. మహారాష్ట్రలో అత్యధిక పాజిటీవ్ కేసులు (200కు పైగా కేసులు), మరణాలు సైతం సంభవించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వలసకూలీలు మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చారని పోలీసులకు బబ్లూ సమాచారం ఇచ్చాడు. కానీ అది తన ప్రాణాల్ని బలి తీసుకుంటుందని ఊహించలేకపోయాడు.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


మద్యం షాపులు ఎప్పుడు తెరుస్తామంటే!


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos


బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone