న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 14 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు వేగంగా కొత్త కేసులు పెరుగుతుండడంతో ఆందోళన తీవ్రమవుతోంది. ఈ తరుణంలోనే లాక్ డౌన్ ముగుస్తుందనే ఆలోచనతో ఏప్రిల్ 15 తర్వాత టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు, ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నవారు జాగ్రత్త వహించవలిసి ఉంటుందని విమానయాన అధికార వర్గాలు సూచిస్తున్నాయి. లాక్ డౌన్ మరిన్ని రోజులు కొనసాగితే మీరు బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ కాకపోవచ్చని, టికెట్ డబ్బులు మీకు రీఫండ్ కాకపోవచ్చని సూచిస్తుస్తున్నాయి.  సన్నీ లియోన్ లేటెస్ట్ బికినీ ఫొటోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాక్ డౌన్ పై, విమాన ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ  ప్రైవేట్ ఎయిర్ లైన్స్ మాత్రం బుకింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రమోషనల్ ఈమెయిల్స్ ను కూడా వినియోగదారులకు పంపుతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో జనాలు చిక్కుకున్నావారంతా ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.


Read Also:  విషాదం.. నిండు గర్భిణిని బలిగొన్న కరోనా మహమ్మారి
మరోవైపు కొత్త క్యాన్సిలేషన్ పాలసీ ప్రకారం షట్ డౌన్ పొడిగింపు వల్ల విమాన సర్వీసులు పున:ప్రారంభం కాకపోతే... టికెట్ డబ్బులు రీఫండ్ చేయలేమని, ఆ డబ్బును క్రెడిట్ కింద హోల్డ్ లో ఉంచుతారని, ఏడాదిలోగా సదరు ప్రయాణికుడు ఎప్పుడైనా ఆ క్రెడిట్ డబ్బుతో ప్రయాణించవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు టికెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బులు వాపసు వచ్చే ప్రసక్తి లేదని విమానయాన వర్గాలు తెలియజేస్తున్నాయి. 


ఈ క్రమంలో ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు లేకుండా ఎయిర్ లైన్స్ కంపెనీలు బుకింగ్స్ ను ప్రారంభించడం నియమాలకు విరుద్ధమని, బుకింగ్ డబ్బులు వెనక్కి రాకపోతే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారని అన్నారు. 


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..