Pathanjali ramdev baba: ఆయుర్వేద ఉత్పత్తుల్లో ప్రముఖమైన పతంజలి సంస్థ చిక్కుల్లో పడింది.  కరోనా వైరస్‌కు ఆ సంస్థ మార్కెట్లో ప్రవేశపెట్టిన మందే దీనికి కారణంగా మారింది. ఢిల్లీలో ఇప్పటికే  పలు కేసులు నమోదైనట్టు సమాచారం. మరి పతంజలి రామ్‌దేవ్ బాబా అరెస్టయ్యేనా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యోగా గురువుగా పతంజలి ( Pathanjali) ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడిగా ప్రాచుర్యం పొందిన రామ్‌దేవ్ బాబా గురించి అందరికీ తెలిసిందే. దేశీయ కంపెనీ బ్రాండ్‌తో మార్కెట్‌లో నిలదొక్కుకోవడమే కాకుండా లాభాలార్జిస్తున్న సంస్థ. ఇప్పుడు ఒక్కసారిగా పతంజలి రామ్‌దేవ్ బాబా Ramdev baba)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్‌కు ఆ కంపెనీ ప్రవేశపెట్టిన మందు. కరోనా సమయంలో కరోనా వైరస్‌కు విరుగుడుగా ప్రకటిస్తూ పతంజలి సంస్థ కోరోనిల్ (Coronil)అనే మందు ప్రవేశపెట్టింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్షన్( Union minister harshavardhan), మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ( Nitin gadkari)ల సమక్షంలో కోరోనిల్ మందును రామ్‌దేవ్ బాబా విడుదల చేశారు. ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా సర్ఠిఫికేట్ ఉందని..ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మరో సర్టిఫికేట్ కూడా ఉందని రామ్‌దేవ్ బాబా ప్రకటించారు అప్పట్లో. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ( World health organisation) తాము పతంజలి ఉత్పత్తులకు ఏ విధమైన సర్ఠిఫికేట్ జారీ చేయలేదని ట్వట్టర్‌లో స్పష్టం చేసింది.


దాంతో ఇప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి మోసానికి పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణం ఢిల్లీ పోలీసుల పతంజలి రామ్‌దేవ్ బాబాను అరెస్టు చేయాలని ఆరోగ్య సంస్థలు, సామాజిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సూర్య ప్రతాప్ సింగ్ సైతం రామ్‌దేవ్ బాబాను అరెస్టు చేయాలంటూ ట్వీట్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World health organisation)ధృవీకరణ పేరుతో కోట్లాది ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన రామ్‌దేవ్ బాబాను అరెస్టు చేస్తారా...దీన్ని అంతర్జాతీయ మోసంగా పరిగణించి కఠిన చర్యలుండేలా చూడాలంటూ ఢిల్లీ పోలీసుల్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 


Also read: Vaccination capacity: అలా చేస్తే రెండు నెలల్లో 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ : విప్రో అజీమ్ ప్రేమ్ జీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook