Couple seen hot romance out side bjp mla office in chhattisgarh: కొందరు యువత విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. యువతలు ప్రేమలో పడి ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారు. బుద్ధిగా చదువుకోవాల్సిన రోజుల్లోనే అడ్డమైన తప్పటడుగులు వేస్తున్నారు. కొందరు తరచుగా యువతో, ప్రేమలో ఉన్నామనిచ చెప్పి, తమ వారిలో తరచుగా సీక్రెట్ గా ఓయోరూమ్ లు, లాడ్జీలకు వెళ్తుంటారు. ప్రస్తుతం హోటల్స్, కొన్ని లాడ్జీలు అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి. ముఖ్యంగా యువత ఇంట్లో వాళ్లకు తెలియకుండా తప్పుడు పనులు చేస్తున్నారు. వయస్సులో ఉన్న ఆకర్శనకు, ప్రేమకు తేడాతెలియకుండా ప్రవర్తిస్తున్నారు.  కాలేజీ రోజుల్లోనే పాడుపనులన్నీచేస్తున్నారు. దీంతో గర్బందాల్చి, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు యువత, ఆలోచనల ధోరణులు వేరేదిగా ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం పాశ్చత్యా పోకడలు, సినిమాల ప్రభావమో కానీ.. బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కొందరు ఓయోరూమ్ లకు, లాడ్జీలకు తమ గర్ల్ ఫ్రెండ్ లతో వెళ్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



తరచుగా ఓయోరూమ్ లు, అనేక హోటళ్లు, లాడ్జీలల అసాంఘీక కార్యకలాపాలు, యువత రోమాన్స్ చేసుకుంటూ దొరికిన ఘటనలు అనేకం వార్తలలో నిలిచాయి. అయితే.. ఛత్తీస్ ఘడ్ లో ఒక ఎమ్మెల్యే తన నియోజక వర్గంలో ఓయోరూమ్ లు మూసేయించాడని లవర్స్ ఆయనపై కోపం పెంచుకున్నారు. తమ  ప్రైవసీకి సదరు ఎమ్మెల్యే భంగంకల్గిస్తున్నారంటూ ఆయనపై మండిపోయారు. ఈ క్రమంలో లవర్స్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది.



పూర్తి వివరాలు..


ఛత్తీస్ ఘడ్ లోని దుర్గ్ జిల్లాలోని వైశాలి నగర్‌ రికేష్ సేన్ విజయం సాధించారు.గత కొన్నిరోజులుగా వైశాలి నగర్‌ నియోజకవర్గంలో ఉన్న ఓయో రూమ్‌లలో యువత పెద్ద ఎత్తున వెళ్తున్నారని, ప్రేమ జంటలు విచ్చలవిడిగా ఓయో రూమ్‌లను వాడుకుంటున్నారని ఎమ్మెల్యే రికేష్ సేన్ కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వైశాలి నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని ఓయో రూమ్‌లను రికేష్ సేన్ మూసివేయించారు. దీంతో ఓయోరూమ్ లో వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ఓయో ప్రతినిధులు, లవర్స్  ఓయో రూమ్ లు తెరిపించాలని  ఎమ్మెల్యేకు పలుమార్లు విజ్ఞప్తులు చేశారు.


Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...


ఆయన అవేం పట్టించుకోలేదు. ఈక్రమంలో చిర్రెత్తుకొచ్చిన ఒక జంట ఏకంగా ఆయన పార్టీ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ అందరు చూస్తుండగానే పబ్లిక్ గా రోమాన్స్ చేయడం ప్రారంభించారు.చుట్టుపక్కల పబ్లిక్ ఉన్నారని కూడా ఏమాత్రం, మోహమాట పడకుండా ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. చివరకు కొంత మంది కార్యకర్తలు అక్కడికి చేరుకుని వారిని బైటకు పంపించి వేశారు. ఓయోరూమ్ లను క్లోజ్ చేయించినందుకు ఇలా చేసినట్లు వారు చెప్పడం గమనార్హం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter