పాఠ్యాంశాలుగా మాల్యా, నీరవ్ మోదీ కేస్ స్టడీలు
ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ కేస్ స్టడీలను బిజినెస్ స్కూళ్లలో పాఠ్యాంశాలుగా చేర్చాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు, ఇతర బిజినెస్ స్కూళ్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ కేస్ స్టడీలను బిజినెస్ స్కూళ్లలో పాఠ్యాంశాలుగా చేర్చాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు, ఇతర బిజినెస్ స్కూళ్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గత దశాబ్దకాలంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో టాప్ ఐఐఎం సంస్థలు ఈ నిర్ణయానికి వచ్చాయి. కార్పొరేట్ నైతిక విలువలు, కార్పొరేట్ గవర్నెన్స్ వంటి అంశాలపై ప్రత్యేకంగా కోర్సులను రూపొందించనున్నాయి.
రూ.వేలకోట్ల మేర భారతీయ బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సహా ఇతర మోసగాళ్లపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎంలు), ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం-ఇండోర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు విద్యార్థులకు వీటిని బోధించనున్నాయి. కోర్సుల రీడిజైన్ కోసం నిపుణుల సమాచారం, సహాయం తీసుకోనున్నారు. కార్పొరేట్ పాలన, నీతి వంటి ఈ కోర్సుల ద్వారా విద్యార్థుల్లో సానుకూల మార్పు తీసుకొస్తామని ఐఐఎం బెంగళూరు ఛైర్‌పర్సన్ పద్మిని శ్రీనివాసన్ తెలిపారు.