Covid 19 Cases Updates: దేశంలో కరోనా కొత్త కేసులు, యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. కొద్దిరోజులుగా కొత్త కేసులు 10 వేల మార్క్‌కి దిగువనే నమోదవుతున్నాయి. గడిచిన 2 రోజుల్లో కేసుల సంఖ్య 6వేల మార్క్‌కి పడిపోయింది. తాజాగా కొత్త కేసుల సంఖ్య మరింత తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5554 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 539 కేసులు తక్కువగా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,44,90,283కి చేరింది. నిన్న కరోనాతో 31 మంది మృతి చెందగా.. గడిచిన 24 గంటల్లో మరో 18 మంది కరోనాకి బలయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 5,28,139కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దేశంలో 48,850 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 0.11 శాతంగా ఉంది. నిన్న 49,636 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా ఇవాళ 786 కేసులు తగ్గాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.47 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.80 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 3,16,504 కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 88.76 కోట్లకు చేరింది.


ప్రస్తుతం జాతీయ స్థాయిలో కోవిడ్ రికవరీ రేటు 98.70 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 6332 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ నమోదైన కోవిడ్ రికవరీల సంఖ్య 4,39,13,294కి చేరింది. గడిచిన 24 గంటల్లో 21.6 లక్షల డోసుల వ్యాక్సిన్లు వేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 214.77 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.  వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఈ ఏడాది జూలైలో భారత్ 200 కోట్ల మైలురాయిని చేరిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యంత వేగంగా ఈ మార్క్‌ని చేరిన రెండో దేశంగా భారత్ నిలిచింది. 



Also Read: Bigg Boss Telugu 6 Elimination: ఆ ఇద్దరు భామల మీద ఎలిమినేషన్ కత్తి..ఒకరు కన్ఫాం!


Also Read: Pinky Finger: మీరెలాంటి వారో మీ చిటికెన వేలు చెప్పేస్తుంది.. ఎలాగో తెలుసా...  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook