Covid 19 Cases Updates: దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొద్దిరోజులుగా 10 వేల మార్క్‌కి అటు, ఇటుగా నమోదవుతున్న కేసులు నిన్నటి (ఆగస్టు 28) నుంచి మరింతగా తగ్గుతున్నాయి. నిన్న  7591 కొత్త కరోనా కేసులు నమోదవగా... ఇవాళ 5439 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,44,21,162కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65,732 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తం కరోనా కేసుల్లోయాక్టివ్ కేసులు 0.15 శాతంగా ఉన్నాయి. కోవిడ్ రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 22,031 రికవరీలు నమోదవగా ఇప్పటివరకూ నమోదైన కరోనా రికవరీల సంఖ్య 4,38,25,024కి చేరింది. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా, వీక్లీ పాజిటివీటీ రేటు 2.64 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 3,20,418 కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా టెస్టులు సంఖ్య 88.55 కోట్లకు చేరింది.


గడిచిన 24 గంటల్లోదేశవ్యాప్తంగా 26,36,224 కరోనా డోసులు వేశారు. మొత్తంగా ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 212.17 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇందులో 94.23 కోట్ల సెకండ్ డోసులు, 15.66 కోట్ల ప్రికాషన్ డోసులు ఉన్నాయి.


గత వారం రోజులతో పోలిస్తే దేశంలో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గిందనే చెప్పాలి. గడిచిన 7 రోజుల్లో  దేశంలో 66  వేల కొత్త కేసులు నమోదవగా, అంతకుముందు వారంలో 80,617 కొత్త కేసులు నమోదయ్యాయి. జూన్ 6-12 తర్వాత ఒక వారంలో ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కేరళ, మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్‌గఢ్ మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్ రేటు కూడా తక్కువగానే ఉంది. 



Also Read: TS Inter Supplementary Results 2022: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి


Also Read: Crime Against Women: మహిళలపై నేరాల్లో దేశంలోనే ఢిల్లీ టాప్... ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న నగరాలివే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook